Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందరికీ అవకాశాలిచ్చి మద్దతు ఇచ్చినట్లే కేఎల్ రాహుల్‌కు కూడా ఇవ్వాలి : సునీల్ గవాస్కర్

KL Rahul Should Get Support and Opportunities From Team Management says Sunil Gavaskar

భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. కేఎల్ రాహుల్‌కు మద్దతిచ్చాడు. టీ20 జట్టులో అతన్ని కొనసాగించాలని పేర్కొన్నాడు. వైస్-కెప్టెన్ అయిన రాహుల్ క్లాస్సీ ఆటగాడని.. అతను గాయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన బ్యాటింగ్ రిథమ్‌ తిరిగి పొందడానికి కొంత సమయం కావాలని పేర్కొన్నాడు. హాంకాంగ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా గెలిచిన అనంతరం సునీల్ గవాస్కర్ ఓ ప్రముఖ వెబ్ సైట్‌తో మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్‌కు కొంత సమయం ఇవ్వాలని.. తగినన్ని అవకాశాలు దక్కాలని పేర్కొన్నాడు. ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్ విఫలమైన ప్లేయర్లకు మద్దతు ఇస్తున్నప్పుడు రాహుల్‌కు ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు.

హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెమ్మదిగా ఆడడంతో కేఎల్ రాహుల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే గవాస్కర్ మాత్రం రాహుల్‌ను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 39బంతుల్లో కేవలం 36పరుగులు మాత్రమే చేశాడు. అతను బ్యాటింగ్లో తీవ్రంగా తడబడుతూ కన్పించాడు. అయితే రెండు చూడచక్కని సిక్సర్లు కొట్టిన రాహుల్ ఆ టెంపోను మెయింటెన్ చేయలేకపోయాడు. ఇకపోతే పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు.

ఇక రెండో మ్యాచ్‌లో కూడా రాహుల్ నిదానంగా ఆడడంతో మొదటి 10ఓవర్లలో భారత్ స్కోరు వేగం పూర్తిగా మందగించింది. ఇక చివర్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా 26బంతుల్లో 68పరుగులు నాటౌట్ దంచడంతో పాటు కోహ్లి 44 బంతుల్లో 59పరుగులు చేయడంతో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 20ఓవర్లలో 192పరుగుల స్కోరును నమోదు చేసింది.

KL Rahul Should Get Support and Opportunities From Team Management says Sunil Gavaskar

'కేఎల్ రాహుల్ ఒక క్లాస్ యాక్ట్ అని నేను అనుకుంటున్నా. అతను టీమిండియా తరపున కొన్నేళ్లుగా మంచి ప్రదర్శన కనబర్చాడు. అతనికి ఇప్పుడు కాస్త వెన్నుతట్టే అవసరముంది. ఇటీవల జట్టులో ఇతర ప్లేయర్లకు ఎలాంటి మద్దతు లభిస్తుందో అలాగే రాహుల్‌కు కూడా మద్దతు లభించాలి. అతనికి అవకాశాలిస్తూ ప్రోత్సహించాలి. పైగా అతను వైస్‌కెప్టెన్ కూడా.

ఒక్కసారి కుదురుకుంటే అతను టీ20 ఫార్మాట్‌లో ఏమి చేయగలడో మనమంతా ఇదివరకే చూశాం. అతను గాయం నుండి ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు. తద్వారా సరైన లయ ఇంకా పొందలేదు. కానీ లయ అందుకుంటాడు. ఒక్కసారి లయ దొరకబుచ్చుకుంటే అతనో విధ్వంసకర ప్లేయర్' అని గవాస్కర్ చెప్పాడు.

Story first published: Thursday, September 1, 2022, 15:41 [IST]
Other articles published on Sep 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+