Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేఎల్ రాహుల్ రీఎంట్రీపై టెన్షన్.. ఇలాగైతే వరల్డ్ కప్ గోవిందా అంటున్న ఫ్యాన్స్!

గాయంతో టీమిండియాకు దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌ విషయంలో కీలక అప్‌డేట్ వచ్చింది. చూస్తుంటే.. అతను మళ్లీ గతేడాది హిస్టరీని రిపీట్ చేయనున్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ సమయంలో గాయపడిన అతను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శస్త్రచికిత్స చేయించుకున్న అతను నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)కు చేరుకున్నాడు.

అక్కడే కొంతకాలం విశ్రాంతి తీసుకొని, రీహాబిలేషన్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే నెలలో ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటనలో కూడా రాహుల్ ఆడటం లేదని సమాచారం. అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ కోసం బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. దానిలో కూడా రాహుల్ ఆడటం జరగదట. ఆ తర్వాత జరిగే ఆసియా కప్‌లో మళ్లీ రాహుల్ ఆడతాడట.

fans are afraid of loosing

ఆసియా కప్‌లో టీమిండియాతో కలిసే అతను.. అనంతరం జరిగే వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాలో కీలకం కానున్నాడు. బలహీనంగా కనిపిస్తున్న భారత మిడిలార్డర్‌కు అతను కీలకం కానున్నాడు. రిషభ్ పంత్ లేని సమయంలో వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా రాహుల్ మీదనే పడే అవకాశం ఉంది. అయితే ఈ వార్త విన్న అభిమానులు అంత సంతోషించడం లేదు.

గతేడాది టీ20 వరల్డ్ కప్ ముందు కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేస్తున్నారు. అప్పుడు కూడా గాయంతో జట్టుకు దూరంగా ఉన్న రాహుల్.. ఆసియా కప్‌లో పునరాగమనం చేశాడు. ఆ టోర్నీలో ఏదో రాణించాడు. కానీ జట్టుకు అవసరమైన రీతిలో ఆరంభాలు అందించడంలో మాత్రం విఫలమయ్యాడు. కానీ వరల్డ్ కప్‌లో కూడా అతన్నే బీసీసీఐ ఆడించింది.

అక్కడ రాహుల్ ఏమాత్రం రాణించాడో అందరికీ తెలిసిందే. జట్టుకు సరైన ఆరంభాలు ఇవ్వడం మాట దేవుడెరుగు.. కనీసం షాట్లు కూడా ఆడలేకపోయాడీ రైట్ హ్యాండర్ బ్యాటర్. అతనితోపాటు రోహిత్ కూడా పేలవంగా ఆడటంతో భారత జట్టు ఆ టోర్నీలో విఫలమైంది. భారత ఓపెనర్లే టీమిండియా వైఫల్యానికి కారణమని చాా మంది మండిపడ్డారు కూడా. ఇప్పుడు కూడా అదే జరిగితే వన్డే వరల్డ్ కప్ కూడా పోయిటన్లే అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

Story first published: Wednesday, June 14, 2023, 17:19 [IST]
Other articles published on Jun 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+