అందుకే క్లీన్ స్వీప్ అయ్యాం.. ఈ ఓటమి మా మంచికే: కేఎల్ రాహుల్

Captain Poor KL Rahul Utterly Disappointed With Teamindia Show | Oneindia Telugu

కేప్‌టౌన్: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో సమష్టిగా విఫలమయ్యామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఈ సిరీస్‌లో ఘోర తప్పిదాలు చేశామని చెప్పేందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదని తెలిపాడు. ప్రపంచకప్ నేపథ్యంలో ఈ సిరీస్ ఓటమి తమ మంచికేనని, ఇదో గుణపాఠమని చెప్పుకొచ్చాడు.

ఆదివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడి 0-3తో క్లీన్‌స్వీప్‌కు గురైన విషయం తెలిసిందే. దీపక్ చాహర్ హాఫ్ సెంచరీతో ఒంటరిపోరాటం చేసినా భారత్‌కు విజయం దక్కలేదు. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా వైఫల్యంపై స్పందించిన రాహుల్.. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమయ్యామని ఒప్పుకున్నాడు.

చెత్త షాట్ సెలెక్షన్..

చెత్త షాట్ సెలెక్షన్..

‘ఈ సిరీస్‌లో మేం ఎక్కడ తప్పులు చేశామో స్పష్టంగా అర్థమవుతుంది. దానికేం సిగ్గుపడటం లేదు. మా షాట్ సెలెక్షన్ మరీ అద్వాన్నంగా ఉంది. బంతితో కూడా మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయం. మైదాన పరిస్థితులను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాం. సరైన ప్రదేశాల్లో బంతిని హిట్ చేయలేక మూల్యం చెల్లించుకున్నాం. ప్రత్యర్థిపై ఏ దశలోనూ ఒత్తిడి తీసుకురాలేకపోయాం. అయితే ఆటగాళ్ల ప్యాషన్, ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, సరైన నైపుణ్యాలను ప్రదర్శించలేకపోవడమే మా ఓటమికి కారణమైంది.

దీపక్ సూపర్..

దీపక్ సూపర్..

కొన్నిసార్లు తప్పులు జరగడం సహజమే. వన్డే సిరీస్‌లో చేసిన తప్పిదాలే రిపీట్ చేశాం. ప్రపంచకప్ ప్రయాణంలో ఇది ఆరంభ దశ మాత్రమే. ఈ సిరీస్‌లోని మా తప్పిదాలపై ఫోకస్ పెట్టి మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తాం. ఈ సిరీస్‌ మాకు ఓ గుణపాఠం. ఇక చివరి వన్డేలో దీపక్ చాహర్ అద్భుత బ్యాటింగ్‌లో ఆశలు రేకెత్తించాడు. మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చి గెలిపించేంత పనిచేశాడు. కానీ చివరకు ఓటమే ఎదురవ్వడం తీవ్ర నిరాశకు గురిచేసింది.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

గెలిచే మ్యాచ్‌లో..

గెలిచే మ్యాచ్‌లో..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ డికాక్‌ ( 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 124) సెంచరీ సాధించాడు. డసెన్‌ (59 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 54) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 49.2 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌటైంది. విరాట్ కోహ్లీ(84 బంతుల్లో 5 ఫోర్లతో 65), శిఖర్ ధావన్(73 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 61) అర్ధసెంచరీలతో రాణించారు.

32వ ఓవర్లో జట్టు స్కోరు 156 పరుగుల వద్ద కోహ్లీ అవుట్‌ కావడంతోనే క్లీన్‌స్వీప్‌ ఖాయమైనప్పటికీ... దీపక్‌ చహర్‌ (34 బంతుల్లో 5 బౌండరీలతో 2 సిక్స్‌లతో 54) మెరుపు బ్యాటింగ్‌తో గెలుపుబాట పట్టింది. 18 బంతుల్లో భారత్‌ విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో 48వ ఓవర్‌ తొలి బంతికి చహర్‌ను ఎన్‌గిడి బోల్తా కొట్టించడంతో టీమిండియా ఓడిపోయేందుకు ఎక్కువసేపు పట్టలేదు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, January 24, 2022, 8:18 [IST]
Other articles published on Jan 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X