KL Rahul: ధోనీని మించిన మెంటార్ లేడు.. అతను డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే..

దుబాయ్‌: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మించిన మెంటార్ లేడని టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ధోనీ ఉంటే డ్రెస్సింగ్‌రూమ్‌ ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో కఠిన పోరాటాలకు సిద్ధమవుతున్న టీమిండియాకు ధోనీ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. ఐపీఎల్‌ 2021 ఫైనల్‌.. ధోనీ చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ అని తామెవరమూ అనుకోవట్లేదని రాహుల్‌ తెలిపాడు.

40 ఏళ్లు దాటినా.. బలంగా ఉన్న కుర్రాళ్ల కంటే కూడా ఎక్కువ దూరం అతడు సిక్స్‌ కొట్టగలడని చెప్పాడు. ధోనీ చాలా బలంగా, ఫిట్‌గా ఉన్నాడని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్న సంగతి తెలిసిందే.

కెప్టెన్‌గా ఉన్నప్పుడే..

కెప్టెన్‌గా ఉన్నప్పుడే..

మెగా టోర్నీలో భారత్‌ తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొంటుంది. ఆదివారం జరగనున్న ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు దుబాయ్ వేదిక కానుంది. మెగా టోర్నీ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ధోనీ తిరిగి జట్టుతో కలిసినందుకు సంతోషంగా ఉంది. మేం అతడి నాయకత్వంలో ఆడాం. కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా మేం అతన్ని మెంటార్‌గానే చూశాం . కెప్టెన్‌గా ఉన్నప్పుడు డ్రెస్సింగ్‌రూమ్‌లో ధోనీ ప్రశాంత స్వభావం మాకు ఎంతో నచ్చేది. అతన్ని ఎంతో గౌరవించేవాళ్లం. ఇప్పుడు అతడు మళ్లీ మాతో కలిసినందుకు గొప్పగా అనిపిస్తోంది. అతన్ని మించిన మెంటార్ అయితే లేడు.

కుర్రాళ్ల కన్నా బలంగా..

కుర్రాళ్ల కన్నా బలంగా..

ధోనీ ఉండడం వల్ల ఒకరకమైన ప్రశాంతత వస్తుంది. గత కొన్ని రోజులుగా అతడి సమయాన్ని వెచ్చించడాన్ని ఆస్వాదిస్తున్నా. చాలా సరదాగా గడిచిపోతోంది. రానున్న రోజుల్లో ధోని బుర్రను పూర్తిగా ఉపయోగించుకుంటా. ఐపీఎల్‌ 2021 ఫైనలే.. ధోని చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ అని మేమేవరమూ అనుకోవడం లేదు. 40 ఏళ్లు దాటినా.. ధోనీ ఫిట్‌గా ఉన్నాడు. బలంగా ఉన్న కుర్రాళ్ల కంటే కూడా ఎక్కువ దూరం అతను సిక్స్‌ కొట్టగలడు. వికెట్ల మధ్య కూడా వేగంగా పరుగెడుతున్నాడు. అతను మాతో ఉండటం చాలా సరదాగా ఉంటుంది.

ఐపీఎల్ ప్రదర్శన..

ఐపీఎల్ ప్రదర్శన..

నిలకడగా రాణిస్తుండటం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. 6-7 ఐపీఎల్ మ్యాచ్‌లు ఇక్కడి పరిస్థితులను అడాప్ట్ చేసుకునేలా చేశాయి. యూఏఈ వేదికగా గతేడాది ఆడిన అనుభవం నాకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా షాట్లు ఆడే విషయంలోనూ, సన్నాహకాల్లోనూ కలిసొస్తుంది.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు. టీ20 క్రికెట్‌లో రాహుల్ గత నాలుగేళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌లో వరుసగా నాలుగు సీజన్లలో 659, 593, 670, 626 పరుగులు చేశాడు. ఈ ఐపీఎల్ ప్రదర్శన ప్రపంచకప్ ముందు తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోందన్నాడు.

సూపర్ ఫామ్‌లో రాహుల్..

సూపర్ ఫామ్‌లో రాహుల్..

ఇక ఇంగ్లండ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో రాహుల్ అద్భుత హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. తనకే సాధ్యమైన క్లాస్ షాట్స్‌తో కనువిందు చేశాడు. జోర్డాన్ బౌలింగ్‌లో స్ట్రైయిట్‌గా అతను కొట్టిన సిక్స్ అయితే ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక నేడు ఆస్ట్రేలియాతో జరిగే రెండో వామప్ మ్యాచ్‌లో రాహుల్ ఆడటం కష్టమే.

ఫస్ట్ మ్యాచ్‌లోనే సూపర్ ఫామ్ అందుకున్న రాహుల్‌ను పక్కనపెట్టి రోహిత్ శర్మ ఆడించే అవకాశాలున్నాయి. ఇప్పటికే రోహిత్, రాహుల్.. మెగాటోర్నీలో ఓపెనింగ్ చేస్తారని కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. వచ్చే ఆదివారం(అక్టోబర్ 24న) దాయాదీ పాకిస్థాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, October 20, 2021, 11:00 [IST]
Other articles published on Oct 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X