KL Rahul: టెస్ట్ కెప్టెన్సీకి నేను రెడీ.. కోహ్లీ నుంచి నేర్చుకుంది అదే!

Ms Dhoni కి Loyal Fan అంటే Virat Kohli నే | Legendary Captains Emotional Bond | Oneindia Telugu

పార్ల్: టీమిండియా టెస్ట్ సారథ్య బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని టీమిండియా తాత్కలిక వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. అయితే దాని గురించి అదే పనిగా ఆలోచించడం లేదన్నాడు. అవకాశం వస్తే మాత్రం తన సాయశక్తులా శ్రమిస్తానని చెప్పాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటూ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరా? అనే చర్చ ఊపందుకుంది.

ప్రధానంగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే రోహిత్ ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా కేఎల్ రాహుల్‌కు టెస్ట్ సారథ్య బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అయితే సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్‌ను ఈ విషయంపై ప్రశ్నించగా.. జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం అనేది ప్రతీ ఆటగాడి కలని, అదో పెద్ద బాధ్యతని తెలిపాడు.

అవకాశం ఇస్తే రెడీ..

అవకాశం ఇస్తే రెడీ..

'జట్టుకు సారథ్యం వహించడమనేది ప్రతీ ఆటగాడి కల. అదో ప్రత్యేక అనుభూతి. దానికి నేనేం భిన్నం కాదు. నాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే మాత్రం పెద్ద బాధ్యత అవుతుంది. అంతేకాకుండా అది నన్ను ఉత్సాహపరిచే అంశం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దాని గురించి నేను ఆలోచించడం లేదు. కానీ అవకాశం వస్తే మాత్రం నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నా శక్తిసామర్థ్యాల మేరకు కృషి చేస్తా. ప్రస్తుతం మాత్రం సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌పైనే నా దృష్టంతా.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఓడినా ఓ గుణపాఠం..

ఓడినా ఓ గుణపాఠం..

ఇక కోహ్లీ గైర్హాజరీలో జోహన్నెస్ బర్గ్ టెస్ట్‌లో భారత జట్టును నడిపించిన కేఎల్ రాహుల్‌కు ప్రతీకూల ఫలితమే ఎదురైంది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే టీమిండియా ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌తో తనకు మంచి అనుభవం వచ్చిందని రాహుల్ తెలిపాడు. ఫలితం అనుకూలంగా లేకున్నా.. ఏన్నో విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నాడు. అందరిలా తన కెప్టెన్సీ ఉండదనీ, సుదీర్ఘ లక్ష్యాలేవి తనకు లేవని ప్రతీ మ్యాచ్ గెలవడమే తన టార్గెట్ అని చెప్పుకొచ్చాడు. ఆరోజు ప్లేయర్‌గా ఎలా ఆడాలనుకుంటానో కెప్టెన్‌గా కూడా అలానే ఉంటానని చెప్పాడు.

ధావన్‌తో కలిసి ఓపెనింగ్..

ధావన్‌తో కలిసి ఓపెనింగ్..

తొలి వన్డేలో తాను ఓపెనర్‌గా ఆడతానని కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు.'నేను గత 14-15 నెలలుగా వన్డేల్లో నెం.4 లేదా నెం.5 స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. జట్టు అవసరాల్ని బట్టి.. నా బ్యాటింగ్ స్థానం మారింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఒకవేళ రోహిత్ శర్మ ఈ జట్టులో ఉండి ఉంటే? నేను టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి ఉండేవాడ్ని. అతను లేడు కాబట్టి.. తొలి వన్డేకి ఓపెనర్‌గా ఆడతాను. శిఖర్ ధావన్ చాలా అనుభవం ఉన్న ఓపెనర్. అతని నుంచి జట్టు ఏం ఆశిస్తుందో అతను అర్థం చేసుకోవాలి. కెప్టెన్‌గా అతనికి సపోర్ట్‌ ఇచ్చి.. భారత్ జట్టు మెరుగైన స్కోరు చేసేందుకు సాయపడతా'అని రాహుల్ పేర్కొన్నాడు.

కోహ్లీ నుంచి నేర్చుకున్నా..

కోహ్లీ నుంచి నేర్చుకున్నా..

ఇక తాను ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడానని చెప్పిన రాహుల్.. వారి అనుభవాన్ని, ఇద్దరి దిగ్గజ కెప్టెన్ల నుంచి నేర్చుకున్న విషయాలను ఉపయోగించుకుంటానని తెలిపాడు. ఆటగాళ్లలో నుంచి ది బెస్ట్ తీసే అద్భుతమైన సామర్థ్యం కోహ్లీకి ఉందని, అతని నుంచి తాను అదే నేర్చుకున్నానని, కెప్టెన్‌గా తాను కూడా అదే చేస్తానని రాహుల్ పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్ పట్ల కోహ్లీ ఉన్న పిచ్చి ఈ ప్రపంచానికి మొత్తం తెలుసని, అతని సారథ్యం వల్లే భారత జట్టు అద్భుత విజయాలందుకుందన్నాడు. ఇక ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా వెంకటేశ్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకుంటామని రాహుల్ హింట్ ఇచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, January 18, 2022, 18:32 [IST]
Other articles published on Jan 18, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X