
చెత్త ఫీల్డింగ్..
'ఫీల్డింగ్ వైఫల్యం మా ఓటమికి కారణమైంది. సులువైన క్యాచ్‌లు నేలపాలు చేస్తే.. ఫలితం ప్రతికూలంగానే ఉంటది. పటీదార్ అద్భుత ఇన్నింగ్స్ కూడా ఓటమికి ఓ కారణం. టాప్-3 బ్యాటర్లలో ఏ ఒక్కరు సెంచరీ చేసినా ఆ జట్టు సునాయసంగా గెలుస్తుంది. ఆర్సీబీ అద్భుతంగా ఫీల్డింగ్ చేసింది. మేం మాత్రం మరి దారుణమైన ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకున్నాం. ఈ సీజన్లో మాకు ఎన్నో సానుకూలంశాలు ఉన్నాయి. ఇదో కొత్త ఫ్రాంచైజీ. అన్ని జట్లలానే మేం కొన్ని తప్పిదాలు చేశాం. వచ్చే సీజన్లో మరింత బలంగా బరిలోకి దిగుతాం. ఇది పూర్తిగా యువ జట్టు.. ఆటగాళ్లు తమ తప్పిదాల నుంచి గుణ పాఠం నేర్చుకుంటారు. మోహ్సిన్ అద్భుతమైన బౌలింగ్‌తో సత్తా చాటాడు. అతని ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. వచ్చే సీజన్‌కు అతను మరిన్నీ నైపుణ్యాలు నేర్చుకొని వస్తాడు.'అని రాహుల్ తెలిపాడు.

సునాయస క్యాచ్‌లు..
ఇక రజత్ పటీదార్ ఇచ్చిన మూడు క్యాచ్‌లను, దినేశ్ కార్తీక్ ఇచ్చిన ఓ క్యాచ్‌లను లక్నో ప్లేయర్లు వదిలేసారు. దాంతో ఈ ఇద్దరు చెలరేగి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. వారి క్యాచ్‌లు పట్టి ఉంటే ఆర్సీబీ చిత్తుగా ఓడేది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. రజత్ పటీదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.లక్నో బౌలర్లలో మోహ్సిన్ ఖాన్, కృనాల్ పాండ్యా, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ దక్కింది.

రాహుల్ వికెట్ టర్నింగ్...
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్( 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 79), దీపక్ హుడా(26 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 45) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్సీబీ బౌలర్లలో హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు. హర్షల్ పటేల్, హజెల్ వుడ్ మ్యాచ్‌ను మలుపుతిప్పారు. 19వ ఓవర్లో కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాలను ఔట్ చేసి హజెల్ వుడ్ మ్యాచ్ మూమెంటమ్ మార్చేసాడు.