
హైదరాబాద్: ఐపీఎల్ 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి. మొహాలి వేదికగా సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 151 పరుగుల లక్యాన్ని పంజాబ్ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
పంజాబ్ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 71 నాటౌట్(7 ఫోర్లు, 1 సిక్సర్) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాహుల్‌తో పాటు మయాంక్ అగర్వాల్ 43 బంతుల్లో 55(3ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 19 పరుగులు అవసరమయ్యాయి.
అదే సమయంలో మయాంక్, మిల్లర్(1), మన్‌దీప్ సింగ్(2) వరుసగా పెవిలియన్‌కు చేరారు. దీంతో విజయం సన్‌రైజర్స్‌ను వరిస్తుందని అంతా భావించారు. కానీ, చివర్లో మరో బంతి మిగిలుండగానే పంజాబ్ విజయం సాధించింది. సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా రషీద్ ఖాన్, కౌల్‌లు తలో రెండు వికెట్లు తీశారు.
పంజాబ్ విజయ లక్ష్యం 151
అంతకముందు డేవిడ్ వార్నర్ 62 బంతుల్లో 70 (4 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు చివర్లో దీపక్ హుడా 3 బంతుల్లో 14(2 ఫోర్లు, ఒక సిక్స్) టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మహ్మద్ నబి(12) కూడా అశ్విన్ బౌలింగ్‌లో రనౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వారంతా వరుసపెట్టి పెవిలియన్‌కు చేరుతున్నా... వార్నర్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. మనీష్ పాండే(19)తో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు.
ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సీజన్‌లో వార్నర్‌కి ఇది మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. పాండే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా 3 బంతుల్లో 14 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అశ్విన్, షమీ, ముజీబ్‌లు తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రెండు మార్పుల చేసింది. మురగన్ అశ్విన్, అండ్రూ టైల స్థానంలో అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ ఉర్ రహ్మన్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.