ప్రౌడ్ ఆఫ్ యూ కేఎల్ రాహుల్.. జాతీయ గీతం టైంలో రాహుల్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా..!

హరారేలో జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై 10వికెట్ల తేడాతో సంపూర్ణ విజయాన్ని టీమిండియా నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆద్యంతం టీమిండియా జింబాబ్వేపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక టీమిండియా ధాటికి తొలుత జింబాబ్వే 189పరుగులకే ఆలౌట్ అయింది. 190పరుగుల ఛేదనలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (82*), శిఖర్ ధావన్ (81*) నాటౌట్‌గా నిలిచి విజయ లాంఛనాన్ని ముగించారు. ఇక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. బంతితో దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్ ఓ వికెట్ తీశాడు.
ఈ మ్యాచ్ ద్వారా కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి తర్వాత మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అలాగే అతను భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతను ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగలేదు. యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్‌ను ఓపెనింగ్ పాత్రలో బరిలోకి దించాడు. రాహుల్ మిడిల్ ఆర్డర్‌కు మారడంతో అతనికి బ్యాటింగ్ అవకాశం దక్కలేదు. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్ చేసిన పని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
వెంటనే నోట్లో నుంచి తీసేసి..
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు జాతీయ గీతాలాపన కోసం గ్రౌండ్లోకి వచ్చాయి. ఇక భారత జాతీయ గీతం ప్రారంభం కానున్న కొద్దీ క్షణాలకు ముందు కేఎల్ రాహుల్ వెంటనే తన నోటిలో ఉన్న చూయింగ్ గమ్ తీసేశాడు. దాన్ని కింద పారేయకుండా అలాగే ఎవరికీ కన్పించకుండా చేతిలో పట్టుకున్నాడు.
జాతీయ గీతం ఆలపిస్తున్న టైంలో అతను నోట్లో చూయింగ్ గమ్ కూడా ఉంచుకుంటూ పాడొద్దని వెంటనే చూయింగ్ గమ్ తీసేసి గౌరవం ప్రదర్శించడం నెటిజన్లను ఆకట్టుకుంది. చిన్న చిన్న విషయాలే పెద్ద ప్లేయర్లను తూచా తప్పకుండా పాటిస్తారని.. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో వాళ్లకు తెలుసునంటూ నెటిజన్లు కేఎల్ రాహుల్ చర్య మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైంది.
ఒక్క చిన్న విషయంతో చూపించావ్
ఇక విషయమై ప్రౌడ్ ఆఫ్ యూ రాహుల్ అంటూ చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఇంకొందరు.. కెప్టెన్ అంటే ఏంటో ఒక్క చిన్న విషయంతో చూపించావ్ అంటూ పేర్కొన్నారు. ఇకపోతే తొలి మ్యాచ్ గెలిచిన అనంతరం భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ తన కమ్ బ్యాక్ గురించి.. అలాగే మ్యాచ్ ప్రదర్శన గురించి పలు అభిప్రాయాలు వెల్లడించాడు. తాము చాలా క్రికెట్ ఆడుతున్నాము కాబట్టి గాయాలు అందులో భాగమేనని గుర్తించాలని పేర్కొన్నాడు.
కష్టమైన సమయాన్ని అనుభవించాను
ఇన్ని రోజులు క్రికెట్‌కు దూరంగా ఉండటం చాలా కష్టం. ఈ కష్టమైన సమయాన్ని నేను అనుభవించాను. బెంగళూరులో నేను, కుల్దీప్, దీపక్ చాహర్ కలిసి రికవరీ అవ్వడంతో పాటు ఫిట్ నెస్ పొందాము. ఈ మ్యాచ్ విషయానికొస్తే స్వింగ్, సీమ్ కదలికలు బాగున్నాయి.. బౌలర్లు క్రమశిక్షణతో వికెట్లు తీయడం మంచి విషయం. చాలా రోజులత తర్వాత భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి రావడం గొప్పగా అన్పించింది.
నాతో పాటు మరికొంతమందికి కూడా ఇది గొప్ప విషయం. ఒక జట్టుగా మేము మంచి ఫాంలో ఉన్నాం. అందరికీ తగినంత అవకాశాలు లభిస్తుండడం కూడా చాలా బాగుంది. ఏదేమైనా ఓ కెప్టెన్‌గా ప్లేయర్‌గా భారత్ తరఫున ఆడుతుండడం మంచి అనుభూతినిస్తుంది. అని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications