For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గోయెంకాతో గొడవ - కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే?

Sanjiv Goenka VS KL Rahul: ప్రస్తుతం ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్‌ ఓనర్ సంజీవ్ గోయెంకా వర్సెస్ దిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్‌ రాహుల్‌ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా లక్నోపై దిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించడంలో కీలక పోత్ర పోషించిన కేఎల్ రాహుల్.. తన మాజీ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకాతో మాట్లాడటానికి నిరాశ వ్యక్తం చేశాడు. గోయెంకా షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడటానికి ప్రయత్నించిన కూడా అందరిముందే మైదానంలో అస్సలు పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. దీంతో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారింది. కేఎల్ రాహుల్.. గత సీజన్ లో తనను అవమానించిన గోయెల్ కు గట్టి బుద్ధి చెప్పాడని అంటున్నారు.

ఈ క్రమంలోనే మ్యాచ్ విజయం తర్వాత కేఎల్ రాహుల్ పెట్టిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. "లక్నోలో తిరిగి పంజుకోవడం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతి." అని రాసుకొచ్చాడు. దీంతో క్రికెట్ అభిమానులు, నెటిజన్లు.. మెగా వేలానికి ముందు సంజీవ్ గోయెంకా, కేఎల్ రాహుల్ ఒకరినొకరు అన్న మాటలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాహుల్ అన్న ఘాటు మాటలను సోషల్ మీడియా ట్రెండింగ్ చేస్తున్నారు.

KL Rahul posts Always good to be back in Lucknow after DC win against LSG owner sanjiv goenka

ముందుగా సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ.. ''ఆటగాళ్లు గెలవాలనే తపనతో ఆడాలి. గెలవాలనే మనస్తత్వంతో ఉండాలి. వ్యక్తిగత ప్రయోజనాలు, ఆకాంక్షల కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావించే వారితోనే ఉండటం మంచిది. అలాంటివారినే రిటైన్‌ చేసుకోవాలని అనుకుంటాం '' అని అన్నారు.

దీనికి.. ''వారు ఈ నిర్ణయం ముందే తీసుకున్నారు. మేనేజ్‌మెంట్ ఏమన్నదో తెలియదు. ఇక నుంచి నా ప్రయాణం కొత్తగా మొదలు పెడతాను. నాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ దొరికే వాతావరణం ఆడతాను. కొన్ని సందర్భాల్లో కొన్నింటినీ వదిలేసి ముందుకు వెళ్లిపోవడమే మంచిది. అదే మనకు కూడా మంచిది. '' అని కేఎల్ రాహుల్ సమాధానమిచ్చాడు.

Story first published: Wednesday, April 23, 2025, 9:54 [IST]
Other articles published on Apr 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+