Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS ENG 3rd ODI: కేఎల్ రాహుల్ ఔట్, పంత్ ఇన్.. తుది జట్టులో మార్పులివే!

తొలి రెండు మ్యాచుల్లో గెలిచి జోష్ మీదున్న టీమిండియా.. ఇప్పుడు మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో పలు మార్పులు చేయనుంది. బెంచ్‌ బలాన్ని పరీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఇప్పటికే ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది టీమిండియా. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ లోనూ గెలిచి.. ఆత్మవిశ్వాసంతో ఛాంపియన్స్ బరిలోకి దిగాలనుకుంటోంది. అయితే అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఈ మూడో వన్డేలో పలు మార్పులో బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. మూడో వన్డే కోసం వికెట్ కీపర్ రిషభ్ పంత్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌, ఫాస్ట్‌ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ సిరీస్ లో ఆడని ఈ ముగ్గురు.. మూడో వన్డే తుది జట్టులో ఉంటారని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ ప్లేస్ లో పంత్, షమి స్థానంలో అర్ష్‌దీప్ ఆడొచ్చు.

KL Rahul OUT Rishabh pant IN TeamIndia s Playing XI For 3rd ODI against england

మొదటి వన్డేలో ఆడిన స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ కూడా ఈ మూడో వన్డేలో ఆడొచ్చు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా స్థానాల్లో కుల్దీప్ యాదవ్, సుందర్‌ను తీసుకునే అవకాశం ఉంది. యశస్వి జైశ్వాల్ మళ్లీ బెంచ్ కే పరిమితం అవ్వొచ్చని సమాచారం.

తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, రిషభ్‌ పంత్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

Story first published: Tuesday, February 11, 2025, 14:35 [IST]
Other articles published on Feb 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+