India Playing XI:కేఎల్ రాహుల్ ఔట్, పంత్ ఇన్ - 2 మార్పులతో ఫైనల్‌లో భారత్ తుది జట్టు ఇదే!
India Playing XI: కోట్లాది మంది అభిమానుల అంచనాలను అందుకుంటూ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కు అర్హత సాధించింది టీమిండియా. మార్చి 4న దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్ లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మార్చి 9న సౌతాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుతో ఫైనల్‌లో తలపడనుంది.
ఎలాగైనా ఈ తుది పోరులో విజయం సాధించి మూడో ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ఫైనల్‌లో తలపడి, ట్రోఫీని గెలవాలంటే బలమైన తుది జట్టు ఉండాలి. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ముందుగానే ప్లేయింగ్ ఎలెవెన్ లో ఎవరెవరు ఆడాలనేది నిర్ణయించుకున్నారట. ఇందుకోసం కొన్ని మార్పులతో బరిలోకి దిగబోతుందని తెలిసింది.

కేఎల్ రాహుల్ ఔట్, రిషభ్ పంత్ ఇన్
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో బెంచ్‌కే పరిమితమైన రిషభ్ పంత్‌కు ఫైనల్‌లో చోటు ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. సెమీ ఫైనల్‌లో కేఎల్ రాహుల్ (36 బంతుల్లో 42) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ ముగించినప్పటికీ, అతడి వికెట్ కీపింగ్ ఆశించిన స్థాయిలో లేదని వాదన. కాబట్టి తుది పోరులో పంత్‌ను తీసుకునే అవకాశం ఉందట. వికెట్ కీపింగ్‌తో పాటు టాప్ 6లో మరో లెఫ్ట్ హ్యాండర్ ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలిసింది.
THE WINNING MOMENT FOR INDIA. 🇮🇳
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025
- KL Rahul finished it off in style. 🔥pic.twitter.com/0AJyYtuiFq
రోహిత్ శర్మ, గిల్ తమ ఓపెనింగ్ బాధ్యతను కొనసాగిస్తారు. కోహ్లీ నెం.3లో రాగా, శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. పంత్ , అక్షర్ పటేల్, హార్దిక్ పటేల్ ఫ్లోటర్స్‌గా రావొచ్చు. ఈ ముగ్గురు పరిస్థితి బట్టి బ్యాటింగ్‌లో ఏ స్థానంలోనైనా దిగొచ్చు. జడేజా ఎనిమిదో స్థానంలో దిగుతాడు.
కుల్దీప్ ఔట్, హర్షిత్ రాణా రిటర్న్..
ఇప్పటివరకు నలుగురు స్పిన్నర్లుతో బరిలోకి దిగుతోన్న టీమిండియా మళ్లీ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగొచ్చు. ముఖ్యంగా సెమీ ఫైనల్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చు. అందుకే కాస్త గాడి తప్పినట్లు ఉన్న కుల్దీప్ యాదవ్ కు విశ్రాంతినిచ్చి హర్షిత్ రాణాను ఎంచుకోవచ్చు. అతడు షమీ, హార్దిక్ పాండ్యతో కలిసి పేస్ బాధ్యతల్ని పంచుకుంటాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, జడేజా స్పిన్ బాధ్యతలను తీసుకుంటారు.
Virat Kohli and KL Rahul. ❤️🫂 pic.twitter.com/UvYEAQnJ8R
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025
తుది జట్టు అంచనా ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications