
నలుగురు పేర్లు సూచించిన ఆకాశ్
తాజాగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు తదుపరి కెప్టెన్ ఎవరనుకుంటున్నారు అని ఓ అభిమాని అడగ్గా.. ఆకాశ్ చోప్రా నలుగురు పేర్లు సూచించాడు. 'శ్రేయస్ అయ్యర్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ వదిలివేస్తుందా?.. ఒకవేళ అదే జరిగితే అతడే కెప్టెన్సీ మెటీరియల్ కావచ్చు.
కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ జట్టులో కొనసాగుతాడా?.. విడుదల చేయబడితే అతడే కెప్టెన్ కావచ్చు. అలానే మయాంక్ అగర్వాల్ విడుదలైతే.. అతడికి అవకాశం ఉంది. ఇక రవిచంద్రన్ అశ్విన్ విడుదలైతే.. అతడు కూడా ఆర్‌సీబీ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

పడిక్కల్‌కు కెప్టెన్సీని అప్పగించడం తొందరపాటే
దేవదత్ పడిక్కల్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ ఇస్తే ఎలా ఉంటుందని ఇంకొక అభిమాని ఆకాశ్ చోప్రాను అడగ్గా.. 'ఇది జరగడం కాస్త కష్టమే. పాడిక్కల్ కెప్టెన్సీని మనం చూడలేదు. కాబట్టి అతను ఎలా చేస్తాడో నాకు తెలియదు. పడిక్కల్‌కు మాత్రం కెప్టెన్సీని అప్పగించడం తొందరపాటే అవుతుంది' అని పేర్కొన్నాడు.
మెగా వేలానికి ముందు ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, యుజ్వేంద్ర చహల్‌లను ఆర్‌సీబీ నిలుపుకుంటుందని ఆకాష్ చోప్రా అంచనా వేశాడు. వీరందరు జట్టులో ఉన్నప్పటికీ.. కొత్త కెప్టెన్ ఎవరు అనేది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. డేవిడ్ వార్నర్ కూడా కెప్టెన్ అభ్యర్థి అని పుకార్లు వస్తున్నందన.. తదుపరి ఆర్‌సీబీ కెప్టెన్ ఎవరు అనేది ఆసక్తికరంగా ఉంటుందన్నారు.
Babar Azam: టీ20ల్లో అరుదైన రికార్డు.. పాకిస్తాన్ కెప్టెన్ తర్వాతే క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ!!

డివిలియర్స్ పేరు వినిపిస్తున్నా
ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా రెండు జట్లు వచ్చి చేరుతుండటం.. మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఆర్‌సీబీని నడిపించే ఆటగాడు ఎవరా? అనే చర్చ ఊపందుకుంది. ఆర్‌సీబీ తదుపరి కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్ పేరు వినిపిస్తున్నా.. వయసు రీత్యా అతను వచ్చే సీజన్ ఆడటంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ ఆడినా ఒకటి లేదా రెండు సంవత్సరాలు ఆడుతాడు కాబట్టి.. అతను సరైన ఎంపిక కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. డేవిడ్ వార్నర్ ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ టీమ్‌లోనే ఉన్న వార్నర్.. ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఆ వైఫల్యంతోనే సీజన్ మధ్యలో కెప్టెన్సీ కోల్పోయాడు. సెకండాఫ్‌లో కూడా అదే పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. దాంతో సన్‌రైజర్స్ వార్నర్‌ర్‌ను వదులుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

వార్నర్ కోసం పోటీ పడనుందా
మెగా వేలం నిబంధనల ప్రకారం నలుగురు ఆటగాళ్లనే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరు విదేశీ, మరో ఇద్దరు స్వదేశీ లేదా ముగ్గురు స్వదేశీ, ఒకరు విదేశీ ఆటగాళ్లను అంటిపెట్టుకోవచ్చు. సన్‌రైజర్స్ విదేశీ ఆటగాళ్ల కోటాలో కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్‌ను రిటైన్ చేసుకుంటుంది. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా డేవిడ్ వార్నర్‌ను వేలంలోకి వదిలేస్తుంది.
అదే జరిగితే.. వార్నర్ కోసం ఆర్‌సీబీ ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. తమ సారథిగా నియమించుకునేందుకు వేలంలో ఎన్ని కోట్ల అయినా కుమ్మరిస్తోంది. వార్నర్ కోసం.. ఈ సీజన్ వేలంలో మ్యాక్సీకి ఉపయోగించిన స్ట్రాటజీనే వాడనుంది. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా వార్నర్ ఆర్‌సీబీ జట్టుకు సరిగ్గా సరిపోతాడని ఇప్పటికే అందరూ అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications












