న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేఎల్ రాహుల్‌కు ఆపరేషన్ సక్సెస్ అది గుడ్ న్యూస్.. కానీ ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది..!

 KL Rahul Operation Success, He will be Recover in Two Months

భారత సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గజ్జలో గాయం కారణంగా జర్మనీలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక అతనికి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. అది గుడ్ న్యూస్ అయితే.. మరో రెండు నెలల పాటు కచ్చితంగా రాహుల్ క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి రావడం అతని అభిమానులకు బ్యాడ్ న్యూస్. అతను కోలుకోవడానికి రెండు నెలలు పట్టొచ్చు. ఈలోపు ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్లతో పాటు ఆసియా కప్ కూడా పూర్తయిపోయే అవకాశముంది. ఇక ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌‌కు కెప్టెన్‌గా ఎంపికైన రాహుల్.. అనూహ్యంగా ప్రాక్టీస్ సెషన్లో గజ్జ గాయం తిరగదొడడంతో ఆ సిరీస్ నుంచి వైదొలగవలసి వచ్చింది. గజ్జతో పాటు పిక్కల్లో నొప్పి తదితర సమస్యలను రాహుల్ ఎదుర్కొంటున్నాడు. ఇక జర్మనీలో శస్త్రచికిత్స విజయవంతం అయిన అనంతరం కేఎల్ రాహుల్ ట్విట్టరులో ఓ పోస్ట్ పెట్టాడు. 'రెండు వారాలు చాలా కష్టమైనప్పటికీ.. నాకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైంది. నేను ప్రస్తుతం కోలుకుంటున్నాను. నా రికవరీ ప్రారంభమైంది. నా కోసం మీరందించిన సందేశాలు, చేసిన ప్రార్థనలకు ధన్యవాదాలు. త్వరలో కలుద్దాం' అంటూ అభిమానులనుద్దేశించి రాహుల్ ట్వీట్ చేశాడు. అలాగే ట్వీట్‌తో పాటు తన ఫోటోను కూడా షేర్ చేశాడు. 30 ఏళ్ల కేఎల్ రాహుల్ గత ఎనిమిదేళ్లలో భారత్ తరఫున 42టెస్టులు, 42 వన్డేలు, 56టీ20లు ఆడాడు.

రెండు లేదా మూడు నెలలు పట్టొచ్చు

ఇక జర్మనీలో అతని చికిత్స ముగిసిందని తెలుస్తోంది. ఇక జర్మనీ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత రాహుల్‌ను నేషనల్ అకాడమీ ఆఫ్ క్రికెట్‌లో డాక్టర్ నితిన్ పటేల్ నేతృత్వంలోని వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. అతను ఎప్పుడు తిరిగి క్రికెట్లో పునరాగమనం చేస్తాడనే విషయమై టైమ్‌లైన్ పెట్టడం ఇప్పట్లో చెప్పడం కష్టమే. అయితే రాహుల్ పూర్తిగా కోలుకుని మళ్లీ ఇండియా జెర్సీని ధరించడానికి మరో రెండు లేదా మూడు నెలలు టైం పట్టవచ్చని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.

ఆసియా కప్ ఆడతాడో ఆడడో తెలీదు..

ఆసియా కప్ ఆడతాడో ఆడడో తెలీదు..

ఇక కేఎల్ రాహుల్ రికవరీ విషయమై ఓ బీసీసీఐ అధికారి పీటీఐతో మాట్లాడాడు. ‘రాహుల్ జర్మనీ నుంచి వచ్చాక కొన్ని రోజులు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటాడు. తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతని శిక్షణ, ఫిట్ నెస్ తదితర విషయాలను వైద్యబృందం ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తాము. అతను తన రెగ్యులర్ నెట్ సెషన్‌తో ప్రారంభించటానికి కొన్ని వారాల సమయం పట్టడం ఖాయంగా కన్పిస్తుంది. ఇక అతను ఆసియా కప్‌ టైంకి టీంలోకి అందుబాటులోకి వస్తాడో రాడో ఇప్పుడైతే చెప్పలేం. కానీ టీ20 వరల్డ్ కప్ టైంకు అతను పూర్తి ఫిట్ నెస్ సాధించొచ్చని అంచనా వేస్తున్నాం.' అని సదరు అధికారి పేర్కొన్నాడు. రాహుల్ టీ20ఫార్మాట్‌లో టీమిండియా తరఫున కీలక ప్లేయర్. ఇక ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో అతను జట్టులో కీలక పాత్ర పోషించాల్సిన అవసరముంది.

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
సరైన టైంలో గాయపడడంతో..

సరైన టైంలో గాయపడడంతో..

ఇకపోతే కేఎల్ రాహుల్ గాయపడ్డంతో టీమిండియాకు దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌లతో జరిగిన టీ20ల సిరీస్‌లకు అతని స్థానంలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించాల్సి వచ్చింది. ఇక ఇంగ్లాండ్‌తో జరగబోయే రీషెడ్యూల్డ్ 5వ టెస్టులో రోహిత్ కోవిడ్ బారిన పడడంతో అతని స్థానంలో రాహుల్ కెప్టెన్సీ చేపట్టాల్సి వచ్చేది కానీ.. ఇప్పుడు బుమ్రా పగ్గాలు స్వీకరించే అవకాశముంది. దీంతో రాహుల్ అభిమానులు కాస్త బాధపడ్డ రాహుల్ ఇప్పుడు కాకున్నా రోహిత్ తర్వాత ఎలాగూ టీమిండియా కెప్టెన్ అవుతాడని వారు ఊరట చెందుతున్నారు.

Story first published: Thursday, June 30, 2022, 12:55 [IST]
Other articles published on Jun 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X