కేఎల్ రాహుల్ డేటింగ్‌లో ఉన్న ఆ బాలీవుడ్ నటి ఎవరు?

హైదరాబాద్: క్రికెటర్లు... బాలీవుడ్ హీరోయిన్లు మధ్య ప్రేమాయణం సాగడం కొత్త విషయమేమీ కాదు. టైగర్‌ పటౌడీతో మొదలు పెడితే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ.. హర్భజన్ సింగ్-గీతా బస్రా ఇలా చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లను ప్రేమించి పెళ్లాడారు. తాజాగా కేఎల్‌ రాహుల్‌ పంజాబీ మోడల్‌, బాలీవుడ్ నటి ఆలియా భట్ స్నేహితురాలు ఆకాంక్ష రంజన్‌ కపూర్‌తో డేటింగ్‌ చేస్తున్నాడని సోషల్‌ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఆకాంక్షకు సోషల్‌మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మందికి పైగా.. ట్విట్టర్‌లో ఎనిమిది వేల మందికి పైగా ఆమెని ఫాలో అవుతున్నారు. ఆలియా భట్‌కు మంచి స్నేహితురాలైన ఆకాంక్ష అంకిత్ తివారి చేసిన 'తేరే దో నైనా' అని మ్యూజిక్ వీడియోలోనూ కనిపించింది. అయితే ఆకాంక్షతో తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కేఎల్ రాహుల్‌తో గడుపుతోందని సమాచారం.

స్మిత్‌ను ఎగతాళి చేసిన ఇంగ్లీషు అభిమానులపై ఆసీస్ ప్రధాని మండిపాటు

అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ

అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ

అంతకముందు కేఎల్ రాహుల్ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమార్తె అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అతియా స్నేహితురాలు ఆకాంక్ష రంజన్‌కపూర్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటోనే ఇందుకు కారణమైంది. కేఎల్ రాహుల్‌, అతియాలతో కలిసి ఉన్న ఫొటోను తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆకాంక్ష "ఆ ప్రేమతో నేనెంతో సంతోషంగా ఉన్నాను" అంటూ కామెంట్ పోస్టు చేసింది.

స్పందించిన కేఎల్ రాహుల్

స్పందించిన కేఎల్ రాహుల్

దీంతో ఈ వార్తలపై కేఎల్ రాహుల్ స్పందించాడు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో "ఓహ్‌, ఇవన్నీ దేని గురించి రాసినట్టు? నేను నిజంగా పేపర్లు చదవను. అందుకే నా గురించి ఏం రాశారో తెలియదు. నా వ్యక్తిగత విషయాలను నాతోనే ఉంచుకొనేందుకు ప్రయత్నిస్తాను. వాటి గురించి ఇతరులతో చర్చించను. ప్రస్తుతానికి క్రికెట్‌కే అంకితమయ్యాను" అని తెలిపాడు.

ఆర్చర్‌ను ట్విట్టర్‌లో విమర్శించిన అక్తర్... యువరాజ్ ధీటైన జవాబు

ఒంటరా? కాదా అన్న ప్రశ్నకు

ఒంటరా? కాదా అన్న ప్రశ్నకు

ఆ తర్వాత మీరు ఒంటరా? కాదా? అన్న ప్రశ్నకు గాను "నిజంగా నాకైతే తెలియదు. ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చినప్పుడు నేనే మీకు తెలియజేస్తాను" అని కేఎల్ రాహుల్‌ అన్నాడు. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ వెస్టిండిస్ పర్యటనలో ఉన్నాడు. విండిస్‌తో శుక్రవారం నుంచి జరిగే తొలి టెస్టులో తుది జట్టులో స్థానం దక్కుతుందో లేదో తెలియదు.

ఇదే తొలిసారి కాదు

ఇదే తొలిసారి కాదు

కాగా, హీరోయిన్లతో కేఎల్ రాహుల్ డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ బాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాక.. వీరిద్దరు కలిసి రెస్టారెంట్‌కి వెళ్లిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. తామిద్దరం చిన్ననాటి నుంచి మంచి మిత్రులమని.. అందుకే కలిసి లంచ్‌కి వెళ్లామని నిధి అగర్వాల్ చెప్పడం విశేషం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, August 19, 2019, 20:21 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X