DC vs GT: ప్రమాదంలో విరాట్ కోహ్లీ రికార్డు
DC vs GT: ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ రోజు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో భారీ రికార్డును బద్ధలు కొట్టే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ ఇంకా 33 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ భారీ రికార్డును బ్రేక్ చేయగలడు. ఢిల్లీ, గుజరాత్ జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించే సువర్ణావకాశం ఉంది. రికార్డుల రారాజు, ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ భారీ టీ20 రికార్డు బ్రేకయ్యే ప్రమాదముంది. ఈ రోజు గుజరాత్ జట్టుతో జరగనున్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 33 పరుగులు చేస్తే టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేయగలడు.
కేఎల్ రాహుల్ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8000 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ ఘనత సాధించడానికి కేఎల్ రాహుల్ ఇంకా 33 పరుగులు మాత్రమే చేయాలి. ఆ పరుగులు సాధిస్తే కేవలం 224 ఇన్నింగ్స్‌లలో 8000 టీ20 పరుగులు చేసిన ఘనతను సాధిస్తాడు. విరాట్ కోహ్లీ ఇన్ని పరుగులు చేయడానికి 243 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 8000 పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాటర్‌గా కూడా కేఎల్ రాహుల్ రికార్డుల్లోకి ఎక్కుతాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసి ఘనత వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. క్రిస్ గేల్ 213 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించాడు. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజం 2022లో తన 227 మ్యాచ్‌లు , 218 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని సాధించాడు.

టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
1.క్రిస్ గేల్ - 213 ఇన్నింగ్స్
2.బాబర్ ఆజం - 218 ఇన్నింగ్స్
3. విరాట్ కోహ్లీ -243 ఇన్నింగ్స్
4.మహ్మద్ రిజ్వాన్ -244 ఇన్నింగ్స్
5. ఆరోన్ ఫించ్ - 254 ఇన్నింగ్స్
కేఎల్ రాహుల్‌ను అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా చాలా మంది పరిగణించకపోయినా ఈ రికార్డును సాధించబోతున్నాడు. దీంతో తనను విమర్శిస్తున్న వారికి ఆయన సమాధానం చెప్పబోతున్నాడు. ఐపీఎల్ 2025 సిరీస్‌లో కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 381 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ సగటు 47.63 కాగా.. 142.63 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications