For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ Vs కోహ్లీ Vs రోహిత్ - స్మార్టెస్ట్ బ్రెయిన్ ఎవరిది? - కేఎల్ రాహుల్ సమాధానమిదే

భారత క్రికెట్ లో ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈ ముగ్గురికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ముగ్గురు కూడా తమ ఆటతో, కెప్టెన్సీతో భారత జట్టుపై ఎంతో ప్రభావం చూపారు. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించారు. ధోనీ తన తెలివితేటలతో వ్యూహాలు రచిస్తే, కోహ్లీ తన దూకుడుతో, రోహిత్ తన హార్డ్ హిట్టింగ్ తో ప్రత్యేర్థులను బోల్తా కొట్టిస్తారు. అందుకే ఈ ముగ్గురులో ఎవరు గొప్ప అనే చర్చ ఎప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ మధ్య జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఈ ముగ్గురిలో ఎవరు స్మార్ట్ కెప్టెన్ అన్న ప్రశ్నకు స్టార్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సమాధానమిచ్చాడు.

ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే తెలివైన, స్మార్టెస్ట్ సారథి అని కితాబిచ్చాడు రాహుల్. ర్యాపిడ్ రౌండ్ ఫైర్ లో కాసేపు కూడా ఆలోచించకుండా టక్కున రోహిత్ శర్మ అని చెప్పాడు. అందులో ఎటువంటి సందేహం లేదని అన్నాడు. రోహిత్ ది స్మార్టెస్ట్ బ్రెయిన్ అని కితాబిచ్చాడు. అలానే తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ ఎవరని అడగగా.. రషీద్ ఖాన్ అని బదులిచ్చాడు. నెట్స్ లో బౌలర్లందరిలో మహ్మద్ షమీ బంతులను ఎదుర్కోవడానికి తాను కష్టపడినట్లు వివరించాడు.

KL Rahul names Rohit Sharma has the smartest brain in the current team in Champions trophy 2025

బెస్ట్ విన్ పర్సంటేజ్..
ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నమెంట్ లలో రోహిత్ శర్మ 27 మ్యాచ్ లకు సారథిగా వ్యవహరించాడు. అందులో 24 మ్యాచుల్లో గెలవగా.. మూడు మ్యాచుల్లో ఓటమిని అందుకున్నాడు. తద్వారా ఐసీసీ టోర్నమెంట్ల చరిత్రలో కెప్టెన్ గా బెస్ట్ విన్ పర్సంటేజ్ ను సొంతం చేసుకున్నాడు. సారథిగా అతడి విజయ శాతం 88.88గా ఉంది.

Take a Poll
Story first published: Tuesday, February 25, 2025, 16:59 [IST]
Other articles published on Feb 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+