For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా ఆల్​టైం ఫేవరెట్ బ్యాట్స్​మన్ అతడే: కేఎల్ రాహుల్

KL Rahul names AB de Villiers as his all-time favourite batsman
KL Rahul Names His Favourite Batsman Of All Time

మంగళూరు: కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తున్న అన్ని దేశాల క్రికెటర్లు చిట్‌చాట్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపున్నారు. కొందరు తమ క్రికెట్‌ అనుభవాలను నెమరువేసుకుంటూ.. రాబోవు సీజన్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడటానికి పరిస్థితులు ఎప్పుడు అనుకూలిస్తాయో కచ్చితంగా చెప్పలేకపోయినా.. త్వరలోనే అంతా సర్దుకుంటుందనే ఆశాభావంతో ఉన్నారు. కాగా తన బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ తనదైన మార్కు వేసిన టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌ సెషన్‌లో పాల్గొన్నాడు.

ఆదివారం ట్విట్టర్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు కేఎల్‌ రాహుల్ సమాధానాలు ఇచ్చాడు. మీ ఆల్​టైం ఫేవరెట్ బ్యాట్స్​మెన్ ఎవరు? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ఏబీ డివిలియర్స్ అని రాహుల్ సమాధానం ఇచ్చాడు. ఐపీఎల్​లో ప్రస్తుతం ఆడుతున్న కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్ కాకుండా మరో ఇష్టమైన జట్టు ఏదంటే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అని చెప్పాడు. గతంలో ​బెంగళూరు తరఫున డివిలియర్స్​, రాహుల్ కలిసి ఆడారు. ప్రస్తుతం డివిలియర్స్ బెంగళూరు జట్టుతోనే ఉండగా.. రాహుల్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు.

KL Rahul names AB de Villiers as his all-time favourite batsman

2013-14 రంజీ ట్రోఫీ గెలువడం కర్ణాటక తరఫున తనకు అత్యంత అద్భుతమైన క్షణాలు అని లోకేష్ రాహుల్ తెలిపాడు. వికెట్‌ కీపింగ్‌ చేసేటప్పుడు ఎవరి బౌలింగ్‌ కఠినంగా ఉంటుందనే ప్రశ్నకు జస్ప్రీత్ బుమ్రా అనే సమాధానమిచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో వికెట్ల వెనకాల కీపింగ్‌ చేయడం కష్టమన్నాడు. బుమ్రా బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడం అంత ఈజీ కాదన్నాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో తన కెరీర్‌ మలుపు తిరగడానికి 2016 ఐపీఎల్‌ కారణమన్నాడు. ఆ సీజన్‌ ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించడంతో తన కెరీర్‌ గాడిలో పడిందన్నాడు.

తన ఐపీఎల్‌ ఫేవరెట్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ మూమెంట్‌ ఏదైనా ఉందంటే.. అది వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌ గేల్‌తోనేనని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. గేల్‌తో తనకు ఎప్పుడూ బాగుంటుందన్నాడు. అందరితోనే గేల్‌ సరదాగా ఉంటాడన్నాడు. అతనొక స్మార్ట్‌ క్రికెటర్‌ అని, గేమ్‌ గురించి కచ్చితమైన ప్రణాళికతో ఉంటాడన్నాడు. 2014 డిసెంబర్‌లో మెల్‌బోర్న్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భాగంగా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ నుంచి టెస్టు క్యాప్‌ను అందుకోవడం తనకు ఒక స్పెషల్‌ మూమెంట్‌ అని రాహుల్ చెప్పాడు. అది అంతర్జాతీయ అరంగేట్రం మ్యాచ్‌ కావడంతో ఎప్పటికీ ఒక ప్రత్యేక క్షణంగానే గుర్తుండిపోతుందన్నాడు.

Story first published: Monday, May 11, 2020, 14:02 [IST]
Other articles published on May 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+