ఎవరూ ఇవ్వనంత!: జాకబ్ మార్టిన్‌కు కేఎల్ రాహుల్ భారీ సాయం


హైదరాబాద్: 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అనవసర వివాదంలో ఇరుక్కున్న కేఎల్ రాహుల్ ఓ మంచి పనితో వార్తల్లో నిలిచాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనారోగ్యం బారిన పడిన మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌కు భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేశాడు. జాకబ్‌కు సాయం చేయడానికి ఇప్పటి వరకూ ఎంతో మంది ముందుకొచ్చారు. వీరందరి కంటే కేఎల్ రాహులే ఎక్కువ మొత్తం సాయం చేశాడని జాకబ్ భార్య ఖ్యాతి తెలిపారు.

ఎంత ఇచ్చానో ఎవరికీ చెప్పొద్దని
ఎంత ఇచ్చానో ఎవరికీ చెప్పొద్దని రాహుల్ చెప్పాడని, అందుకే ఆ వివరాలను వెల్లడించలేనని ఖ్యాతి అన్నారు. జాకబ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న రాహుల్ సిబ్బంది వివరాలు అడిగారని, సాయంత్రంలోగా అకౌంట్లో డబ్బులు వేశారని ఆమె తెలిపారు. డిసెంబరు 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాకబ్ మార్టిన్ ఊపిరితిత్తులు, కాలేయం పూర్తిగా దెబ్బతిన్నాయి.

దీంతో నెలరోజులుగా
దీంతో నెలరోజులుగా ఆయన వడోదరలోని ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. జాకబ్ మార్టిన్‌కు ఆర్ధిక సమస్యలు తలెత్తడంతో చికిత్స చేయడం కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకుని మార్టిన్‌కు సాయం చేసేందుకు టీమిండియా మాజీలు, క్రికెటర్లు, బీసీసీఐ, బరోడా క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

రోజుకు 70,000 ఖర్చవుతున్నాయి
జాకబ్ మార్టిన్ వైద్య ఖర్చుల నిమిత్తం రోజుకు 70,000 ఖర్చవుతున్నాయి. జాకబ్ మార్టిన్ చికిత్స కోసం బీసీసీఐ రూ.5 లక్షలు, బరోడా క్రికెట్ అసోసియేషన్ రూ.3 లక్షలు ఇచ్చాయి. మార్టిన్ పరిస్థితి గురించి తెలుసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అండగా ఉంటూ తనవంతు ఆర్థిక సాయం చేశారు.

ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అధికారులు
చెన్నై సూపర్ కింగ్స్ రూ.3 లక్షలు ఇవ్వగా.. జహీర్, రవిశాస్త్రి కూడా తమవంతు తోడ్పాటు అందించారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న కృనాల్ పాండ్య మీకు అవసరమైనంత డబ్బు తీసుకోండంటూ.. బ్లాంక్ చెక్ పంపించాడు. జాకబ్ ఆరోగ్య పరిస్థితి గురించి బీసీసీఐ, సీఓఏ అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని మాజీ బరోడా ఓపెనర్ రాకేశ్ పారిఖ్ తెలిపాడు.

బరోడా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా
బరోడా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన జాకబ్ మార్టిన్ మొత్తం పది వన్డేలాడి మార్టిన్ 158 పరుగులు చేశాడు. ప్రస్తుతం జాకబ్ కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి మార్చినట్లు వైద్యులు తెలిపారు. తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications