
విశాఖకు చేరుకున్న ఇరుజట్లు
మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న టెస్ట్ మ్యాచ్‌లో తలపడేందుకు ఇరు జట్లు సోమవారం విశాఖలో వాలిపోయాయి. వారంతా ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం విశాఖకు విచ్చేశారు

హాయ్
అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో బీచ్‌రోడ్డులో నోవాటెల్‌కు వెళ్లారు. అక్కడ హోటల్ ప్రతినిధులు క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు.

ఇంగ్లాండ్ ఆటగాళ్లు
ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ కుక్, హమీద్, రూట్, స్టోక్స్, రషీద్, అన్సారీ తదిరత క్రీడాకారులు వచ్చారు. ఇరు జట్ల క్రీడాకారులు మంగళవారం స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేయనున్నారు.

కెప్టెన్ కోహ్లీ
భారతజట్టు టెస్టు సారథి విరాట్‌కోహ్లీ పాటు జడేజా, మురళీ విజయ్, అమిత్‌మిశ్రా, పుజారా, గంభీర్, రహానే, అశ్విన్, సాహా తదితర క్రికెటర్లు విశాఖ చేరుకున్నారు.

రహానే
‘పిచ్ మీద పెద్దగా పచ్చిక ఉండదు. పిచ్‌కు నీళ్లు పట్టడం కూడా మానేశాం. రెండో రోజు లంచ్ విరామం నుంచి బంతి తిరిగే అవకాశముంది. ప్రస్తుం ఇక్కడ వాతావరణం కూడా వేడిగా ఉంది కాబట్టి పిచ్ పొడిగా కనిపిస్తోంది. మ్యాచ్ రోజు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి' అని క్యురేటర్ కస్తూరి శ్రీరామ్ తెలిపాడు.

రవీంద్ర జడేజా
‘అయితే విశాఖ పిచ్ ఏకపక్షంగా మాత్రం ఉండదని ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు చెబుతున్నాడు. ఐతే పిచ్ సమతూకంతోనే ఉంటుంది. ఇరు జట్లకూ ఒకేలా సహకరిస్తుంది. మ్యాచ్‌లో ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం' అని ఆయన చెప్పాడు.

కోచ్ అనీల్ కుంబ్లే
అయితే ఓ మోస్తరుగా స్పిన్నర్లకు సహకరించిన రాజ్‌కోట్ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెట్టిన ఇంగ్లాండ్ స్పిన్నర్లు.. విశాఖలో పిచ్ మరింతగా స్పిన్‌కు సహకరిస్తే ఇంకెంతగా కోహ్లీసేనకు సవాలు విసురుతారో చూడాలి.

కోహ్లీ, గౌతం గంభీర్
పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తే భారత్ పైచేయి సాధించడం తర్వాత.. దాని బదులు మనకే ఇబ్బంది ఎదురైతే అంతే సంగతులు. గురువారం ఆరంభమయ్యే రెండో టెస్టు కోసం భారత్, ఇంగ్లాండ్ జట్లు విశాఖకు చేరుకున్నాయి. మంగళవారం ఇరు జట్ల ఆటగాళ్లు సాధన ఆరంభించనున్నారు.


Click it and Unblock the Notifications











