
ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదింది రాహుల్
ఇదిలా ఉంటే.. 12 ఐపీఎల్ సీజన్లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన బ్యాట్స్‌మన్ ఎవరంటే? వెంటనే గుర్తొచ్చే పేర్లు వెస్టిండీస్ విధ్వంసక వీరులు క్రిస్ గేల్, అండ్రూ రసెల్, కిరన్ పోలార్డ్. ఇలా అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్టే. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదింది మరెవరో కాదు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ లోకేశ్ రాహుల్. 14 బంతుల్లో రాహుల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) ఫిఫ్టీ కొట్టి ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో వేగవంతమైన అర్ధ శతకం 12 బంతుల్లో (యువరాజ్ సింగ్ 2007 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై) నమోదైంది.

15 బంతుల్లో నరైన్ అర్ధ సెంచరీ
ఇక్కడ మరోవిషయం ఏంటంటే.. ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడే క్రిస్ గేల్, అండ్రూ రసెల్ కన్నా కరేబియన్ స్టార్ స్పిన్నర్ సునిల్ నరైన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) తక్కువ బంతుల్లో ఫిఫ్టీ బాదాడు. నరైన్ 15 బంతుల్లో అర్ధ సెంచరీ బాది రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. యూసుఫ్ పఠాన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) కూడా 15 బంతుల్లో ఫిఫ్టీ కొట్టి నరైన్‌తో సహా రెండో స్థానంలో ఉన్నాడు. 16 బంతుల్లో ఫిఫ్టీ చేసిన టీ20 స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్) మూడో ప్లేస్‌లో ఉన్నాడు.

16 బంతుల్లో ఫిఫ్టీ జాబితా
16 బంతుల్లో ఫిఫ్టీ కొట్టిన బ్యాట్స్మన్లు చాలా మంది ఉన్నారు. కీరన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్), క్రిస్ గేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), సునిల్ నరైన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (డెక్కన్ చార్జర్స్), ఇషాన్ కిషన్ (ముంబై ఇండియన్స్), క్రిస్ మోరిస్ (ఢిల్లీ క్యాపిటల్స్)లు 16 బంతుల్లో ఫిఫ్టీ బాదారు. ఇక రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్), జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్) 18 బంతుల్లో చేసారు.

ఒకే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు?
వైరస్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ జరగని విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ఎలాగైనా నిర్వహించాలని బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లను ఒకే స్టేడియంలో నిర్వహించాలని చూస్తోందని సమాచారం. బెంగుళూరు, మొహాలి, జైపూర్, హైదరాబాద్ వంటి పలు పట్టణాలలో ఏదైనా ఒక దానిని ఎంపికచేసి, అక్కడే మొత్తం మ్యాచులను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబైలోని వాంఖడే స్టేడియం, క్రికెట్ క్లబ్, డీవై పాటిల్ స్టేడియంలను ఐపీఎల్ వేదికగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే కరోనా ఉధృతి కారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితేనే ఐపీఎల్ 2020కి అవకాశం ఉంటుంది.
కళ్లద్దాలు పెట్టుకున్న ఆ అమ్మాయి బాగా నచ్చింది.. ఆమెతో డేట్‌కు వెళతా: గంగూలీ


Click it and Unblock the Notifications












