For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేఎల్ రాహుల్ డబుల్ ధమాకా: డకెట్‌ను దాటి అగ్రస్థానం!

IND vs WI: భారత టెస్ట్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ తన అద్భుతమైన ఫామ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో నిలకడగా రాణించడం ద్వారా 2025లో టెస్ట్ క్రికెట్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఈ సెంచరీతో కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్‌కు చెందిన బెన్ డకెట్‌ను వెనక్కి నెట్టేశాడు.

డకెట్‌ను దాటి అగ్రస్థానానికి..
ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్, కేఎల్ రాహుల్ ఇద్దరూ పరుగుల వేటలో పోటీ పడ్డారు. అహ్మదాబాద్ టెస్ట్ ప్రారంభానికి ముందు 2025లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్ల జాబితాలో డకెట్ 602 రన్స్‌తో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే వెస్టిండీస్‌పై రాహుల్ అద్భుతమైన సెంచరీ సాధించడంతో, అతను మొత్తం 649 పరుగులతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో రాహుల్ ఈ ఏడాది అత్యుత్తమ టెస్ట్ ఓపెనర్ అనిపించుకున్నాడు.

KL Rahul Hits Double Delight Tops 2025 Test Opener Run Charts Overtakes Ben Duckett

అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్లు (2025):
1.కేఎల్ రాహుల్-649(భారత్)
2.బెన్ డకెట్ -602(ఇంగ్లాండ్)
3.యశస్వి జైస్వాల్ -479(భారత్)
4.ఉస్మాన్ ఖవాజా-461 (ఆస్ట్రేలియా)
5.జాక్ క్రాలీ -414 (ఇంగ్లాండ్)

అహ్మదాబాద్ టెస్టులో రాహుల్ అద్భుత సెంచరీ
అహ్మదాబాద్ టెస్ట్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కేఎల్ రాహుల్ 114 బంతుల్లో 6 బౌండరీలతో 53 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రెండో రోజు ఆటలోనూ అద్భుతంగా ఆడిన కేఎల్ రాహుల్, తన కెరీర్‌లో 11వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.కేఎల్ రాహుల్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించి భారత్‌కు శుభారంభం అందించాడు. జైస్వాల్ 54 బంతుల్లో 7 బౌండరీలతో 36 పరుగులు చేసి ఔటయ్యాడు.

మొత్తం పరుగుల జాబితాలోనూ...
ఓపెనర్‌గానే కాకుండా 2025 సంవత్సరంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా కేఎల్ రాహుల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జింబాబ్వేకు చెందిన సీన్ విలియమ్స్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో లీడ్స్‌లో 137 పరుగులు, లార్డ్స్‌లో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్.. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించడం భారత టెస్ట్ జట్టుకు గొప్ప బలంగా మారింది.

Story first published: Friday, October 3, 2025, 13:35 [IST]
Other articles published on Oct 3, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+