IND A vs ENG Lions: ఇండియ ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ప్రస్తుతం నార్తాంప్టన్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జేమ్స్ ర్యూ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ టీమిండియా తరఫున ఓపెనింగ్ బాధ్యతను తీసుకున్నాడు. అందరి దృష్టంతా అతనిపైనే ఉంది. కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ చేశాడు.
ఓపెనర్‌గా సెంచరీ
కేఎల్ రాహుట్ ఇటీవల ఇంగ్లాండ్‌కు చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న వెంటనే తన అద్భుతమైన ఫామ్‌ను చూపించాడు. కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో ఆడుతూ సెంచరీ సాధించాడు. ఇది కేఎల్ రాహుల్ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 19వ సెంచరీ. దీనితో పాటు కేఎల్ రాహుల్ ఇప్పుడు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ లో ఓపెనింగ్ కోసం తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అయినందున కేఎల్ రాహుల్ టీమిండియాకు శాశ్వత ఓపెనర్‌గా మారవచ్చు.

ధ్రువ్ జురేల్ హాఫ్ సెంచరీ
కేఎల్ రాహుల్ 151 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. ధ్రువ్ జురేల్ కూడా అర్థ సెంచరీ చేశాడు. అతను 69 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. కానీ హాఫ్ సెంచరీ చేసిన వెంటనే ధ్రువ్ జురేల్(52) ఔటయ్యాడు. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడు. కానీ అతను 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన యశస్వి రాణించలేకోపోయాడు. జైస్వాల్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. జైస్వాల్ అంపైర్ నిర్ణయంతో ఏకీభవించలేదు. అతను అంపైర్‌తో వాదించాడు కూడా. అయితే ఈ మ్యాచ్‌లో డీఆర్ఎస్ లేనందున జైస్వాల్ తిరిగి పెవిలియన్‌కు చేరాల్చి వచ్చింది. యశస్వి జైస్వాల్ కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు.
కొత్త ఓపెనర్ కోసం అన్వేషణ
రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఇంగ్లాండ్‌లో జైస్వాల్‌తో కలిసి ఎవరు ఓపెనింగ్ చేస్తారనే ప్రశ్న తలెత్తింది. కేఎల్ రాహుల్ సెంచరీ సాధించి ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. కేఎల్ రాహుల్ గతంలో కూడా ఇంగ్లాండ్ జట్టుపై ఓపెనింగ్ చేశాడు. కేఎల్ రాహుల్ సెంచరీ సాధించి ఓపెనింగ్ కోసం ఒక మార్గాన్ని చూపించాడు.