Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC T20 Rankings: ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగ‌బాకిన‌ కేఎల్ రాహుల్‌

KL Rahul has moved up to fourth position in the ICC T20 rankings


ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స‌త్తా చాటాడు. ఒక స్థానానికి మెరుగుప‌ర‌చుకుని నాలుగో ర్యాంకుకు చేరాడు. రాహుల్ ఖాతాలో 729 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక సీనియ‌ర్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ప‌దో ర్యాంకులో ఉన్నాడు. అత‌ని ఖాతాలో 657 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక‌ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ప‌ద‌కొండో ర్యాంకులో ఉన్నాడు. ఇక బౌల‌ర్ల జాబితాలో టాప్ 10లో టీమిండియా ఆట‌గాళ్లెవ‌రికీ చోటు ద‌క్క‌లేదు. సీనియ‌ర్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ 20వ ర్యాంకులో ఉండ‌గా.. పేస్ గ‌న్ జ‌స్ప్రీత్ బుమ్రా 26వ ర్యాంకులో ఉన్నాడు. అటు ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో కూడా టాప్ 10లో భార‌త ఆట‌గాళ్ల‌కు ఎవ‌రికీ చోటు ద‌క్క‌లేదు.

టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగుతున్నాడు. అత‌ని ఖాతాలో 805 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆ త‌ర్వాత రెండో స్థానంలో పాకిస్థాన్ ఓపెన‌ర్ మహ్మ‌ద్ రిజ్వాన్ ఉన్నాడు. అత‌ని ఖాతాలో 798 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానంలో సౌతాఫ్రికా బ్యాట‌ర్ ఐడెన్ మార్క్రామ్ ఉన్నాడు. అత‌ని ఖాతాలో 796 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఐదో స్థానంలో ఇంగ్లండ్ బ్యాట‌ర్ డేవిడ్ మ‌లాన్ ఉన్నాడు. అత‌ని ఖాతాలో 728 పాయింట్లు ఉన్నాడు. ఇంత‌కుముందు నాలుగో ర్యాంకులో ఉన్న భార‌త బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ ఆ స్థానాన్ని ఆక్ర‌మించ‌డంతో ఐదో స్థానానికి ప‌డిపోయాడు. ఆరో స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఉన్నాడు. అత‌ని ఖాతాలో 709 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక ఏడో స్థానంలో న్యూజిలాండ్ బ్యాట‌ర్ డేవిడ్ కాన్వే ఉన్నాడు. అత‌ని ఖాతాలో 703 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఎనిమిదో స్థానంలో సౌతాఫ్రికా బ్యాట‌ర్ డ‌సెన్ ఉన్నాడు. అత‌ని ఖాతాలో 669 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. తొమ్మిదో స్థానంలో న్యూజిలాండ్ ఓపెన‌ర్ మార్టిన్ గుప్తిల్ ఉన్నాడు. అత‌ని ఖాతాలో 658 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.

ఇక బౌల‌ర్ల జాబితాలో శ్రీ‌లంక బౌల‌ర్ హ‌స‌రంగ నంబ‌ర్ వ‌న్ జాబితాలో ఉన్నాడు. అత‌ని ఖాతాలో 797 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో ర్యాంక్‌లో సౌతాఫ్రికా బౌల‌ర్ షంసీ ఉన్నాడు. అత‌ని ఖాతాలో 784 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్ బౌల‌ర్ ఆదిల్ ర‌షీద్ 746 రేటింగ్ పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉన్న ర్యాంకులో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా బౌల‌ర్ ఆడ‌మ్ జంపా 725 రేటింగ్ పాయింట్ల‌తో ఉన్నాడు.

Story first published: Wednesday, February 2, 2022, 17:34 [IST]
Other articles published on Feb 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+