Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రముఖ హోటల్లో డిన్నర్ డేట్.. రాహుల్-అతియాల ప్రేమాయ‌ణం నిజమేనా?

KL Rahul goes on a dinner date with Bollywood actress Athiya Shetty

ముంబై: టీమిండియా యువ ఆట‌గాళ్ల‌లో కర్ణాటక ఆటగాడు కేఎల్ రాహుల్ తీరే వేరు. కెరీర్ మొదటి నుంచి ఆట‌తో క‌న్నా ఇత‌ర విషయాలలోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. జ‌ట్టులో త‌న స్థానాలను మార్చిన మాదిరిగానే.. ప్రియురాళ్ల‌ను కూడా మారుస్తాడ‌నే పేరుంది మనోడికి. కేఎల్ రాహుల్ గతంలో గతంలో నిధి అగర్వాల్‌, సోనాల్‌ చౌహాన్‌, ఆకాంక్ష రంజన్‌తో ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి.

డిన్నర్ డేట్:

డిన్నర్ డేట్:

గత కొద్దీ రోజుల నుండి బాలీవుడ్ నటి అతియా శెట్టితో రాహుల్ డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు జోరందుకున్నాయి. అయితే తాజాగా రాహుల్-అతియా డిన్నర్ డేట్ కోసం వెళ్లారు. ముంబైలోని ఓ ప్రముఖ హోటల్లో డిన్నర్ చేసేందుకు రాహుల్-అతియా వెళ్లారు. హోటల్ నుంచి బయటకు వస్తుండగా కెమెరాలకు చిక్కారు. వీరితో పాటు అథియా స్నేహితురాలు ఆకాంక్ష, బాలీవుడ్ నటుడు పంచోలీ కూడా ఉన్నారు. దీంతో ఈ ఇద్దరి ప్రేమాయణం నిజమేనన్న చర్చ జరుగుతోంది. ఇద్దరి మధ్య 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.

 డేటింగ్‌ నిజమేనా:

డేటింగ్‌ నిజమేనా:

రాహుల్-అతియాలు డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ నిర్మాత విక్రమ్ ఫడ్నీస్ గతంలో పేర్కొన్నాడు. అప్పటినుంచి ఈ జంట ప్రేమాయణం వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే అతియా-రాహుల్ ఇప్పటివరకు తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పలేదు. ఇక ఇప్పుడు డిన్నర్ డేట్‌కు వెళ్లడంతో ఇద్దరి మధ్య డేటింగ్‌ నిజమనే అందరూ అంటున్నారు.

సునీల్‌ శెట్టి కుమార్తె:

సునీల్‌ శెట్టి కుమార్తె:

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కుమార్తె అతియా శెట్టి. అతియా స్నేహితురాలు ఆకాంక్ష రంజన్‌కపూర్‌ గతంలో ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేసింది. కేఎల్ రాహుల్‌, అతియాలతో కలిసి ఉన్న ఫొటోను తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆకాంక్ష..'ఆ ప్రేమతో నేనెంతో సంతోషంగా ఉన్నాను' అంటూ కామెంట్ పోస్టు చేసింది. ఎవరేం పోస్ట్ చేసినా.. రాహుల్-అతియాలు స్పందిస్తే తప్ప ఈ వార్తల్లో నిజమెంతో తెలుస్తుంది.

రాహుల్‌కు అవకాశం కష్టమే:

రాహుల్‌కు అవకాశం కష్టమే:

భారత జట్టులో చోటు కోల్పోవడంతో కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం కర్ణాటక జట్టు తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో రాహుల్‌ అదరగొట్టాడు. ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసాడు. అయితే రాహుల్‌ స్థానంలో ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న రోహిత్‌ శర్మ తొలి టెస్టులోనే సత్తాచాటాడు. వరుస ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసాడు. మరోవైపు మయాంక్ అగర్వాల్ కూడా డబుల్ సెంచరీ చేయడంతో ఇప్పట్లో రాహుల్‌కు అవకాశం రావడం కష్టమే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Story first published: Monday, October 7, 2019, 12:17 [IST]
Other articles published on Oct 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+