Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KL Rahul: ఇంటెన్స్ ట్రైనింగ్‌లో రాహుల్.. ఆసియా కప్‌కు రెడీ అయినట్లేనా?

టీమిండియా వెటరన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడుతుండగా.. కేఎల్ రాహుల్ తొడ కండరాలకు గాయం తగిలిన సంగతి తెలిసిందే. దీంతో శస్త్రచికిత్స చేయించుకున్న అతను. ప్రస్తుతం ఎన్సీయేలో కోలుకుంటున్నాడు.

ఇటీవల బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా రాహుల్ మొదలు పెట్టినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే అతను ఆసియా కప్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో తాజాగా ఒక వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. రాహుల్ కోలుకోకపోతే వన్డే వరల్డ్ కప్‌లో కూడా అతను ఆడలేడు.

KL Rahul

ఈ గాయం తగలడానికి ముందు వన్డే టీంలో రాహుల్ చాలా కీలకంగా ఉన్నాడు. మిడిలార్డర్‌లో అతను జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకలా మారాడు. అయితే ఐపీఎల్‌లో సడెన్‌గా అతను గాయపడటంతో టీం కాంబినేషన్ అంతా తారుమారైంది. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ సమయంలో టీమిండియా ఇబ్బందుల్లో పడేలా నిపించింది.

అయితే ఇప్పుడు అతను దాదాపు కోలుకున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం అతను ఎన్సీయే నెట్స్‌లో బ్యాటింగ్, వికెట్ కీపింగ్ అంతా మంచి ఇంటెన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఈ వీడియోను కేఎల్ రాహుల్ తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాహల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే అతను నేరుగా టీమిండియాలోకి వచ్చేస్తాడని మాజీ దిగ్గజాలు కూడా అంటున్నారు. అతను ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ పలుమార్లు టీమిండియా బ్యాటింగ్ కుప్పకూలకుండా కాపాడిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్ గురించి పెద్దగా సమాచారం లేకపోవడం గమనార్హం.

అలాగే గతేడాది నుంచి వెన్నుగాయంతో జట్టుకు దూరంగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా కూడా పూర్తిగా కోలుకున్న సంగతి తెలిసిందే. అతను ఐర్లాండ్‌తో టీ20 సిరీసులో టీమిండియాకు నాయకత్వం వహిస్తాడని బీసీసీఐ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, August 2, 2023, 17:28 [IST]
Other articles published on Aug 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+