For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిపోర్టర్‌ ఇంటెన్షన్ కనిపెట్టేసిన రాహుల్.. కోహ్లీ బ్యాటింగ్ గురించి తన అభిప్రాయం చెబుతూనే..!

KL Rahul Gave a Satirical Answer to Reporter who has An intension to kohli Should open batting

భారత వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసియా‌కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన చివరి సూపర్ 4గేమ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గాయం వల్ల జట్టుకు చాలా కాలం పాటు దూరమైన కేఎల్ రాహుల్ కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాక తొలిసారి ఫిఫ్టీ బాదాడు. విరాట్ కోహ్లీ తన తొలి టీ20సెంచరీ సాధించడంతో రాహుల్ ఇన్నింగ్స్‌కు పెద్దగా గుర్తింపు దక్కలేదు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఈ ఎడిషన్‌లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని (119) అందించారు.

భారత్ రెండో అతిపెద్ద టీ20విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యాడు. అతన్ని విరాట్ కోహ్లీ గురించి విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు. అయితే ఒక ప్రత్యేక ప్రశ్న కేఎల్ రాహుల్‌ను బాగా ఇరిటేట్ చేసింది. రోహిత్ గైర్హాజరీలో ఆఫ్ఘనిస్తాన్‌పై ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్‌ను ప్రపంచకప్ సహా రాబోయే టోర్నమెంట్‌లలో కూడా ఓపెనర్‌గా ప్రయత్నించే వీలుందా అని ఒక రిపోర్టర్ అడిగాడు.

రిపోర్టర్ : ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా ఐదు సెంచరీలు కొట్టాడు. ఈరోజు ఓపెనింగ్‌లో అతను మళ్లీ సెంచరీ చేశాడు. కాబట్టి వైస్ కెప్టెన్‌గా మీరు కోహ్లీని ఓపెనర్‌గా ప్రయత్నించవచ్చని జట్టు మేనేజ్‌మెంట్‌కు చెబుతారా? రానున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లతో పాటు ప్రపంచ‌కప్‌లో కూడా అతన్ని వన్డౌన్ల కాకుండా ఓపెనర్‌గా ఆడించాలని చెబుతరా?

కేఎల్ రాహుల్: అంటే నీ ఉద్దేశం ఏంటీ..? నేను జట్టులో కాకుండా బయట బెంచ్ మీద కూర్చోవాలనేగా..?

ఇక కేఎల్ రాహుల్ మాటలను బట్టి కోహ్లీ గనుక ఓపెనర్‌గా బరిలోకి దిగితే అతని స్థానం గల్లంతు అవుతుందని, రోహిత్, కోహ్లీ ఓపెనర్లుగా దిగితే తాను బయట కూర్చోవాలా చెప్పండి అంటూ రాహుల్ రిపోర్టర్‌తో అన్నాడు. అలాగే కోహ్లీ రోల్ జట్టులో ఏంటనేది అందరికీ తెలిసిందే. అతన్ని ఏ స్థానంలో ఆడించాలో ఓ స్పష్టత ఉంది. అతను వన్డౌన్లో దిగినప్పుడు కూడా సెంచరీలు కొట్టగలడు. ఆడే స్థానం ఇంపార్టెంట్ కాదని, అవకాశం వచ్చి రిథమ్ ఉన్నప్పుడు మిడిలార్డర్లో దిగినా సెంచరీ కొట్టవచ్చని రాహుల్ చెప్పాడు.

Story first published: Friday, September 9, 2022, 15:30 [IST]
Other articles published on Sep 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+