Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

12 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ లేదు: సందిగ్ధంలో కేఎల్ రాహుల్ టెస్టు కెరీర్!

KL Rahul Flattered To Deceive Says VVS Laxman || Oneindia Telugu
KL Rahul flattered to deceive: Laxman; heres a look at whats going wrong with India opener

హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటనలో కేఎల్ రాహుల్ ప్రదర్శన పూర్తిగా నిరాశపరిచింది. నెలరోజుల పాటు సుదీర్ఘ పర్యటనలో కేఎల్ రాహుల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ ఫామ్‌పై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశాడు.

టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్యూలో వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ "కేఎల్ రాహుల్ ఫామ్‌పై ఆందోళనగా ఉంది. అతని సామర్థ్యాన్ని ప్రశ్నించాల్సిన పనిలేదు. టెస్ట్ క్రికెట్‌కు కొత్తవాడు కాదు. ఇప్పటికే టెస్టుల్లో అనేక అవకాశాలను పొందాడు. అయినా సరే అతడు వరుసగా విఫలమవుతున్నాడు" అని అన్నాడు.

రాహుల్‌పైనే ఎందుకు ఈ విమర్శలు

రాహుల్‌పైనే ఎందుకు ఈ విమర్శలు

కేఎల్ రాహుల్ తన టెస్టు కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. కెరీర్ తొలినాళ్లలో అనేక ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే, ఈ మధ్య కాలంలో అతడిలో నిలకడ లోపించింది. టెస్టుల్లో కేఎల్ రాహుల్ చివరగా సెంచరీ బాది ఏడాది అవుతుంది. గతేడాది ఇంగ్లాండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 12 ఇన్నింగ్స్‌లు ఆడిన కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు.

విండిస్ పర్యటనలో రాహుల్ ప్రదర్శన

విండిస్ పర్యటనలో రాహుల్ ప్రదర్శన

ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో కేఎల్ రాహుల్ 44, 38 పరుగులు చేశాడు. ఇక, జమైకా వేదికగా జరిగిన రెండో టెస్టులో సైతం పేలవ ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే పరిమితమైన కేఎల్ రాహుల్... రెండో ఇన్నింగ్స్‌లో కీమర్ రోచ్ బౌలింగ్‌లో మరీ ఛీఫ్‌గా ఔటయ్యాడు. రెండో టెస్టులో హనుమ విహారి సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 257 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కేఎల్ రాహుల్ తదుపరి భవితవ్యం

కేఎల్ రాహుల్ తదుపరి భవితవ్యం

సెప్టెంబర్‌లో సపారీ జట్టు టీమిండియా పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. తొలి టెస్టు అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌లో గనుక కేఎల్ రాహుల్ రాణిస్తే జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటాడు. అలాకాని పక్షంలో అతడి స్థానాన్ని పృథ్వీషాతో భర్తీ చేయాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

యువ క్రికెటర్ల నుంచి తీవ్రపోటీ

యువ క్రికెటర్ల నుంచి తీవ్రపోటీ

భారత జట్టులో యువ క్రికెటర్ల నుంచి తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. అయితే, నిషేధిత ఉత్ప్రేరికం తీసుకున్న కారణంగా పృథ్వీషాపై బీసీసీఐ ఈ ఏడాది నవంబర్ నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. నిషేధం ముగిసిన తర్వాత వెంటనే అతడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. మరోవైపు ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఓపెనర్ రోహిత్ శర్మ వెస్టిండిస్ పర్యటనలో చోటు దక్కించుకున్నాడు. అయితే, రెండు టెస్టుల్లోనూ రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. మరోవైపు శిఖర్ ధావన్, మురళీ విజయ్ నుంచి కూడా కేఎల్ రాహుల్‌కు పోటీ ఉంది.

Story first published: Thursday, September 5, 2019, 15:42 [IST]
Other articles published on Sep 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+