న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KL Rahul: నేను ఇంత ఇబ్బంది పడుతుంటే.. సూర్య వచ్చీరాగానే దంచాడు..! అతని షాట్లు నమ్మశక్యంగా లేవు..

KL Rahul Feels that Suryakumar Yadav Shots are Unbelievable

తిరువనంతపురం స్టేడియం వేదికగా.. సౌతాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. బుధవారం జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఇక ఈ మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తడబడుతుంటే.. సూర్య ఎంచక్క బౌండరీలు బాదడాన్ని నమ్మలేకపోయానంటూ ఆశ్చర్యపోయాడు. అలాగే అర్షదీప్ సింగ్ గేమ్ ఇంప్రూవ్ మెంట్‌ను తెగ మెచ్చుకున్నాడు.

సూర్య అవతలి ఎండ్‌లో ఉండడంతో సపోర్ట్

సూర్య అవతలి ఎండ్‌లో ఉండడంతో సపోర్ట్

'కచ్చితంగా ఇది కఠినమైన పిచ్‌. మేము ఇలాంటి కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఆడాం. కానీ నేను పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డా.. ఎటాకింగ్ ఆడడం ఈ పిచ్‌లో చాలా కష్టమైన పని. సూర్య మాత్రం వచ్చీ రాగానే షాట్‌లు ఆడడం నమ్మశక్యంగా లేదు. ఇలాంటి వికెట్‌ మీద బ్యాటర్‌ వైపు బంతులు ఎలా దూసుకొస్తున్నాయో చూడొచ్చు. తొలి బంతికి సూర్యకు డైరెక్ట్ బంతి తాకింది. అయితే అతని అప్రోచ్ మాత్రం ఫిక్స్‌డ్‌గా ఉంది. అతను తనదైన షాట్లను ఆడాలని, దూకుడుగా ఉండాలని ఫిక్సయ్యాడు. సూర్య మరో ఎండ్‌లో రాణిస్తుండడంతో.. నేను నిలదొక్కుకుని ఆడటానికి నాకు టైం దొరికింది.'

అర్షదీప్ లాంటి బౌలర్ ఉండడం మంచి విషయం

అర్షదీప్ లాంటి బౌలర్ ఉండడం మంచి విషయం

మేము నిన్న ఇక్కడ ప్రాక్టీస్ చేశాం. ప్రాక్టీస్ కూడా చాలా టఫ్‌గా అనిపించింది. ఇది అంత సులభమైన వికెట్ కాదు. కాబట్టి మేమంతా మానసికంగా సిద్ధమయ్యాము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మమ్మల్ని మేం సవాలు చేసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇక అర్ష్‌దీప్ సింగ్ గురించి చెప్పాలంటే అతను ప్రతి గేమ్‌ ఇంప్రూవ్ అవుతున్నాడు. అతను మంచి మెంటాలిటీ ఉన్న ప్లేయర్. ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు నేను అతన్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశా. ఇకపోతే ఐపీఎల్లో 2022 సీజన్‌లో తన ఫ్రాంచైజీ కోసం ఎంతో అద్భుతంగా రాణించాడు. అతను జట్టులో నంబర్ వన్ డెత్ బౌలర్‌గా నిలిచాడు. జట్టులో మనకు లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావాలి. అర్ష్‌దీప్ లాంటి లెఫ్టార్మ్ సీమర్‌ను జట్టులో కలిగి ఉండటం మంచి విషయం.' అని కేఎల్ రాహుల్ అన్నాడు.

సూర్య, రాహుల్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో..

సూర్య, రాహుల్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 8వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేసింది. అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీయడంతో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అయితే మార్క్‌రమ్(25), వేన్ పార్నెల్(24), కేశవ్ మహరాజ్(41) పోరాడి గౌరవ ప్రదమైన స్కోర్ అందించారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 110పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్), కేఎల్ రాహుల్ (51నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Story first published: Thursday, September 29, 2022, 9:38 [IST]
Other articles published on Sep 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X