
వరద్‌కు అరుదైన వ్యాధి
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన 11 ఏళ్ల వరద్ తల్లిదండ్రులు సచిన్ నలవాడే, స్వప్న. తండ్రి బీమా ఏజెంట్‌గా పని చేస్తుండగా.. స్వప్న గృహిణిగా ఉంది. వరద్ ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్నాడు. అయితే వరద్ అరుదైన రక్త రుగ్మతకు సంబంధించిన అప్లాస్టిక్ అనీమియా (బ్లడ్ క్యాన్సర్) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో హెమటాలజిస్టుల సంరక్షణలో అతనికి చికిత్స అందిస్తున్నారు. వరద్ రక్తంలో ప్లేట్‌లెట్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయి. అతని రోగనిరోధక వ్యవస్థ ఇతర ఇన్‌ఫెక్షన్‌లకు దారి తీశే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో వరద్‌కు సాధారణ జ్వరం వచ్చినా నయం కావడానికి నెలల సమయం పడుతుంది. దీంతో అతనికి ఎముక మజ్జ మార్పిడి మాత్రమే శాశ్వత నివారణ అని వైద్యులు నిర్ణయించారు. అంతేకాకుండా వీలైనంత తొందరగా శస్త్ర చికిత్స చేయాలని తెలిపారు.

చికిత్సకు రూ.35 లక్షలు
వరద్ శస్త్ర చికిత్స కోసం 35 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని అతని తల్లిదండ్రులకు వైద్యులు తెలిపారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వరద్ తల్లిదండ్రుల వద్ద నిధుల కొరత ఏర్పడింది. వరద్ వైద్య ఖర్చుల కోసం అతని తండ్రి తన పీఎఫ్ డబ్బులను కూడా ఖర్చు చేశాడు. క్రికెటర్ కావాలని కలలు కంటున్న వరద్ కోసం అతని 11వ పుట్టిన రోజు సందర్భంగా తండ్రి సచిన్ క్రికెట్ బ్యాట్ కానుకగా ఇచ్చాడు. ఇక ఆపరేషన్‌కు అయ్యే ఆర్థిక సాయం కోసం వరద్ తల్లిదండ్రులు దాతలను ఆశ్రయించారు.

31 లక్షలు సాయం
దీంతో తన టీం ద్వారా వరద్ అనారోగ్య పరిస్థితిని తెలుసుకున్న రాహుల్.. తక్షణ సాయంగా వెంటనే ఆపరేషన్ ఖర్చుల కోసం 31 లక్షల రూపాయలను పంపించాడు. దీంతో వైద్యులు వరద్‌కు ఆపరేషన్ నిర్వహించి ఎముక మజ్జ మార్చారు. ప్రస్తుతం వరద్ కోలుకుంటున్నాడు. ‘గివ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నాకు వరద్ అనారోగ్యం గురించి తెలిసింది. దీంతో వెంటనే నా వల్ల అయిన సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఆపరేషన్ సక్సెస్ కావడం, వరాద్ కోలుకుంటుండడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. వరద్ వీలైనంత త్వరగా కోలుకుని క్రికెటర్ కావాలనే అతని కలను నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నాను ' అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.

రాహుల్‌కు రుణపడి ఉంటాం
‘వరద్ శస్త్రచికిత్స కోసం ఇంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చినందుకు మేము కేఎల్ రాహుల్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అతనికి రుణపడి ఉంటాం. కెఎల్ రాహుల్ ముందుకు రాకపోతే ఇంత తక్కువ సమయంలో వరాద్‌కి ఎముక మజ్జ మార్పిడి శస్త్ర చికిత్స జరిగేది కాదు.' అని వరద్ తల్లి స్వప్న తెలిపింది.

రాహుల్‌ను వరద్ అనుకరిస్తాడు
"మేము కేఎల్ రాహుల్‌కు ధన్యవాదాలు చెబుతున్నాం. వరద్‌కు కొత్త జీవితాన్ని అందించిన రాహుల్ దాతృత్వానికి రుణపడి ఉంటాం. రాహుల్ లాంటి క్రికెట్ దిగ్గజం ముందుకు వచ్చి ఒకరి ప్రాణాలను కాపాడేందుకు ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. వరద్‌ను రక్షించడానికి భారత ఆటగాడు వస్తాడని వరద్ కుటుంబం ఊహించలేదు. భవిష్యత్‌లో భారత్ తరఫున ఆడడం గురించి వరద్ తరచుగా మాట్లాడుతుంటాడు. తన ప్రాణాలను కాపాడిన వ్యక్తి(కేఎల్ రాహుల్)ని వరద్ అనుకరించే అవకాశం ఉంది.'' అని గివ్‌ఇండియా సీఓఓ సుమిత్ తాయల్ చెప్పారు.


Click it and Unblock the Notifications












