బెంగుళూరు టెస్టు: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత
హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్‌కి ఇది మొదటి అర్ధ సెంచరీ కావడం విశేషం.
భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం పరుగుల్లో కేఎల్ రాహుల్ ఒక్కడే 90 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. మూడో రోజు ఆటలో రాహుల్ 82 బంతుల్లో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. అనంతరం ఒకీఫ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధసెంచరీలు
తద్వారా ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధసెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు రెండు ఇన్నింగ్స్‌ల్లో యాభైకి పైగా పరుగులు చేసిన మూడో ఓపెనర్‌గా అరుదైన ఘనతను సాధించాడు. గతంలో
వెస్టిండిస్‌కు చెందిన గ్రీనిడ్జ్, భారత్‌కు చెందిన అజయ్ జడేజాలు మాత్రమే ఇక్కడ రెండు ఇన్నింగ్స్ ల్లో యాభైకి పైగా పరుగులు సాధించారు.

మూడో ఓపెనర్‌గా అరుదైన ఘనత
తాజాగా కేఎల్ రాహుల్ కూడా వీరి జాబితాలో చేరాడు. 1995లో ఇక్కడ జరిగిన టెస్టులో ఓపెనర్గా దిగిన అజయ్ జడేజా రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన అప్పటి మ్యాచ్‌లో జడేజా ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత ఇంతకాలానికి ఓ భారత్ ఓపెనర్ బెంగళూరులో రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్థ సెంచరీలు చేశాడు.
టీ విరామానికి టీమిండియా 122/4
బెంగుళూరు వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీ విరామ సమయానికి భారత్ 39 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా 34, రహానే 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతక ముందు భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.

బెంగుళూరు టెస్టులో కేఎల్ రాహుల్ అత్యధిక స్కోరు
రెండో టెస్టులో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ అత్యధిక స్కోరు నమోదు చేశాడు. బెంగళూరు టెస్టుకు ముందు రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు 38 పరుగులుగా ఉంది. అయితే ఈ టెస్టులో ఆ మార్కుని దాటాడు. ఇప్పటి వరకు మొత్తం 14 టెస్టులాడిన రాహుల్ 23 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ అత్యధిక స్కోరు 199 కాగా రెండో ఇన్నింగ్స్‌లో 38. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ 90 పరుగులు చేసిన రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications