Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాణిలా చూసుకుంటా: నిధి అగర్వాల్‌తో డేటింగ్‌పై కేఎల్ రాహుల్

KL Rahul Spotted With Bollywood Actress In Mumbai
KL Rahul Clears The Air On His Relationship With Bollywood Actress Nidhhi Agerwal

హైదరాబాద్: రెండు రోజుల క్రితం టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటి నిధి అగర్వాల్‌తో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో వీరి మధ్య కొన్ని రోజుల కిందటే ప్రేమ చిగురించిందని, వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

నిధి అగర్వాల్‌తో డేటింగ్ వార్తలపై స్పందించిన కేఎల్ రాహుల్

నిధి అగర్వాల్‌తో డేటింగ్ వార్తలపై స్పందించిన కేఎల్ రాహుల్

అయితే, ఈ వార్తలపై తాజాగా శుక్రవారం కేఎల్ రాహుల్ స్పందించాడు. నిధి అగర్వాల్ తనకు చాలా రోజులుగా తెలుసని, తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశాడు. తాను ఎవరితోనైనా డేటింగ్ చేస్తే కచ్చితంగా అందరికీ చెబుతానని, దాచి పెట్టనని కేఎల్ రాహుల్ అన్నాడు.

ఆమె నాకు చాలా రోజులుగా తెలుసు

ఆమె నాకు చాలా రోజులుగా తెలుసు

'ఇద్దరు యువతీయువకులు స్నేహితులుగా ఉండకూడదా? ఆమె నాకు చాలా రోజులుగా తెలుసు. ఇద్దరం ఒకే ఊరికి చెందినవాళ్లం. ఆమె తన ఫీల్డ్‌లో చాలా బాగా రాణిస్తోంది. నేను క్రికెటర్‌ని, ఆమె బాలీవుడ్ నటి కాకముందు నుంచే ఇద్దరి మధ్య పరిచయం ఉంది. మేమిద్దరమే లంచ్‌కు వెళ్లలేదు. మాతోపాటు బెంగళూరు నుంచి మరో ముగ్గురు, నలుగురు ఉన్నారు' అని చెప్పాడు.

మా మధ్య ఏమీ లేదు

మా మధ్య ఏమీ లేదు

'స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు లంచ్‌కు వెళ్లడం తప్ప... మా మధ్య ఏమీ లేదని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఏదైనా ఉంటే కచ్చితంగా చెబుతాను. నా కాబోయే భార్యను ఓ రాణిలా చూసుకుంటాను' అని కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ ఇద్దరూ ముంబైలోని బాంద్రాలో ఓ రెస్టారెంట్‌లో కలిసి ఉన్న ఫొటోను కేఎల్ రాహుల్ ఫ్యాన్ పేజ్ షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది

మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది

మరోవైపు కేఎల్ రాహుల్‌తో డేటింగ్ చేస్తుందంటూ వచ్చిన వార్తలపై గురువారం నిధి అగర్వాల్ స్పందించిన సంగతి తెలిసిందే. ‘ఔను..నేను, రాహుల్‌ కలిసి డిన్నర్‌కు వెళ్లింది నిజమే. గతంలోనూ చాలా సార్లు వెళ్లాం. ఎన్నో ఏళ్ల నుంచి మేమిద్దరం ఒకరికొకరం తెలుసు. రాహుల్‌ క్రికెటర్‌ అవ్వకముందు, నేను నటిని కాకముందు నుంచి మా ఇద్దరికీ పరిచయం ఉంది. అలా అని మేమిద్దరం బెంగళూరులో కలిసి చదువుకున్నాం అని అనుకునేరు. అలాంటిదేమీ లేదు. ఎప్పట్నుంచో మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది అంతే' అని తెలిపింది.

Story first published: Friday, June 1, 2018, 17:59 [IST]
Other articles published on Jun 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+