IND Vs NZ: 'న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు రోహిత్ ఆడతాడా లేదా?' - కేఎల్ రాహుల్ క్లారిటీ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా న్యూజిలాండ్ తో జరగబోయే ఆఖరి లీగ్ మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడని ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. గాయం వల్ల అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడని కథనాలు వచ్చాయి. తాజాగా ఈ ప్రచారంపై భారత స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్పందించాడు.
"ఫిట్ నెస్ పరంగా, నాకు తెలిసి అంతా బాగానే ఉన్నారు. ఎవ్వరూ కూడా న్యూజిలాండ్ తో మ్యాచ్ దూరంగా ఉండట్లేదనే నాకు తెలుసు." అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో కేఎల్ రాహుల్ అన్నాడు. దీంతో మహ్మద్ షమీ కూడా న్యూజిలాండ్ తో మ్యాచ్ కు అందుబాటులోనే ఉంటాడని పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు రాహుల్.
ప్రాక్టీస్ మొదలుపెట్టిన రోహిత్
న్యూజిలాండ్ తో మ్యాచ్ కు ఫిబ్రవరి 27న జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ పాల్గొనలేదన్న సంగతి తెలిసిందే. అతడు గాయం కారణంగా విశ్రాంతి తీసుకున్నాడు. అయితే తాజాగా అతడు రెండో రోజు (ఫిబ్రవరి 28) ప్రాక్టీస్ సెషన్ పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో అతడు న్యూజిలాండ్ మ్యాచ్ ఆడతాడని కన్ఫామ్ అయిపోయింది.

అతడిలో ఎన్నో సెంచరీలు ఉన్నాయి...
న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ కోహ్లీకి 300వ వన్డే మ్యాచ్. దీనిపై మాట్లాడిన కేఎల్ రాహుల్.. కోహ్లీ కీలకమైన సీనియన్ ప్లేయర్ అని అన్నాడు. విరాట్ మరిన్ని సెంచరీలు బాదాలని ఆకాంక్షించాడు. "అతడు ఎంత గొప్ప ఆటగాడో అభివర్ణించడానికి మాటలు కూడా లేవ్. ఎన్నో అంతర్జాతీయ మ్యాచులు ఆడిన ఎంతో గొప్ప గొప్ప ఆటగాడు అతడు. మేము ఎప్పుడూ ఆరాధించే ముఖ్యమైన సీనియర్ ప్లేయర్. అతడిలో ఇంకా ఎన్నో సెంచరీలు దాగి ఉన్నాయి" అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications