Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : ఫీల్డింగ్ చేస్తూ నిద్ర పోతున్న రాహుల్?.. బంతి బౌండరీ వెళ్తున్నా..!

KL Rahul caught napping during play in INDvsAUS test

ఆస్ట్రేలియా, భారత్ మధ్య టెస్టు సిరీస్ చూస్తున్న భారత అభిమానులంతా ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై మండిపడుతున్నారు. తొలి రెండు టెస్టుల్లో రోహిత్‌తో కలిసి జట్టుకు మంచి ఓపెనింగ్ అందించాల్సిన రాహుల్ అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో అయినా రాణిస్తాడని అనుకుంటే అక్కడా చేతులెత్తేశాడు. దీంతో అతనిపై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. దానికితోడు ఫీల్డింగ్‌లో కూడా రాహుల్ తెల్లమొఖం వేయడం మరింత వివాదాస్పదమైంది.

ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ఆ మ్యాచ్ రెండో రోజు ఆటలో రాహుల్ కళ్లు తేలేశాడు. ఆస్ట్రేలియా ఓపెనర్లు సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో.. రవీంద్ర జడేజా బౌలింగ్ చేస్తున్నాడు. అతను వేసిన ఫ్లయిటెడ్ డెలివరీని ఉస్మాన్ ఖవాజా మిడ్ వికెట్ మీదుగా బాదాడు. ఆ సమయంలో రాహుల్ డీప్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఖవాజా బాదిన బంతి రాహుల్ పక్క నుంచే వెళ్తోంది. దాన్ని ఆపడానికి రాహుల్ ఏమీ చేయలేదు. తెల్లమొఖం వేసుకొని చూస్తుండిపోయాడు. అతని కళ్ల ముందే బంతి బౌండరీ దాటింది.

ఇది చూసిన అభిమానులు రాహుల్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బ్యాటింగ్ చేయడం లేదంటే, ఇప్పుడు ఫీల్డింగ్‌లో కూడా చేతులెత్తేస్తున్నావా? అని అడుగుతున్నారు. మైదానంలో నిద్ర పోతున్న రాహుల్ అంటూ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు కొందరు. అయితే రాహుల్ ఇలా బౌండరీ వదిలేసిన తర్వాతి బంతికే జడ్డూ చాకచక్యంగా ఖవాజాను తన బుట్టలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడో రోజు తొలి సెషన్‌లోనే ఆస్ట్రేలియా జట్టు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పుజారా, భరత్ వేగంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. బంతితో, బ్యాటుతో రాణించిన రవీంద్ర జడేజాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Sunday, February 19, 2023, 19:15 [IST]
Other articles published on Feb 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+