న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాలీవుడ్ భామతో రాహుల్ ప్రేమకు చెక్.. అన్నా అనేసింది..!!

KL Rahul bro-zoned by Bollywood actress Nidhhi Agerwal, Twitterati trolls him mercilessly

హైదరాబాద్: బాలీవుడ్ భామ నిధి అగర్వాల్‌తో ప్రేమలో ఉన్నాడంటూ టీమిండియా క్రికెటర్ రాహుల్‌పై వచ్చిన రూమర్లకు తెరపడింది. కొద్ది నెలల ముందు ముగిసిన ఐపీఎల్ అనంతరం కేఎల్ రాహుల్ ముంబైలోని ఓ రెస్టారెంట్లో.. బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌తో కనిపించాడు. దీంతో వెబ్ మీడియా, సోషల్ మీడియా అంతటా వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. ఆమె చేసిన ట్వీట్ వాటన్నిటికీ తెరపడే విధంగా ఉంది.

ఆతిథ్య ఇంగ్లాండ్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో ముందుగా ఫీల్డింగ్ చేసింది టీమిండియా. అయితే మైదానంలో ఉన్న కేఎల్ రాహుల్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచిన నిధి అగర్వాల్.. ఆల్ ది బెస్ట్ బ్రో.. అంటూ కామెంట్ పెట్టింది. ఆ తర్వాత చేధనకు దిగిన టీమిండియాలో కేఎల్‌ రాహుల్‌ డకౌటయ్యాడు. ఇంతటితో అయిపోలేదు.. ఈ సారి రాహుల్‌ డకౌటవ్వడానికి నిధి అగర్వాల్ కారణమంటూ రాహుల్‌పై జోకులు పేలుస్తున్నారు నెటిజన్లు.

నిధి తనను సోదరుడు అన్నందుకే మనస్తాపం చెందిన రాహుల్‌ డకౌటయ్యాడంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(36) ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన రాహుల్‌.. ప్లంకెట్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రెండు బంతులు ఆడిన రాహుల్‌ పరుగుల ఖాతానే తెరవలేదు.

అప్పట్లో వచ్చిన రూమర్లపై కొద్ది రోజుల తర్వాత స్పందించిన రాహుల్‌, నిధి..'మేమిద్దరం ఒకరికొకరం ఎప్పటి నుంచో తెలుసు. ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే' అంటూ రాహుల్ కూడా గతంలో ఓసారి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం నిధి కూడా రాహుల్‌తో కలిసి ఇంగ్లాండ్‌లోనే ఉంది.

Story first published: Tuesday, July 17, 2018, 16:09 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X