
భారత్ తరుపున 1000 పరుగులు
ఫలితంగా టీ20ల్లో భారత్ తరుపున వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు టీ20ల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. కేఎల్ రాహుల్ తన 29వ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరాడు.

ఫించ్ సరసన రాహుల్
ఈ క్రమంలో ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ సరసన కేఎల్ రాహుల్ నిలిచాడు. ఇదిలా ఉంటే, టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్థాన్ యువ ఆటగాడు బాబర్ అజామ్(26 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా, కొహ్లీ(27 ఇన్నింగ్స్)లతో రెండో స్థానంలో ఉన్నాడు.

కోహ్లీ 94 నాటౌట్
కోహ్లీ(50 బంతుల్లో 94; 6 ఫోర్లు, 6 సిక్సులు), ఓపెనర్ కేఎల్ రాహుల్(40 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

1-0 ఆధిక్యంలో టీమిండియా
టీ20ల్లో కోహ్లీకి ఇది 23వ హాఫ్ సెంచరీ. ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా రెండో టీ20 ఆదివారం తిరువనంతపురంలో జరగనుంది.


Click it and Unblock the Notifications












