For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ చరిత్రలో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డ్, ఎంత గొప్ప బ్యాటరో తెలపడానికి ఈ రికార్డే నిదర్శనం

KL Rahul became the first player to score over 600 runs in four seasons in the IPL

లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ 2022సీజన్లో రాహుల్ 15ఇన్నింగ్స్‌ల్లో 51.33సగటుతో 616 పరుగులు చేశాడు. అతను 135.38 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు. ఈ సీజన్లో రెండు సెంచరీలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ తొలి ఐపీఎల్ సీజన్‌లోనే ప్లేఆఫ్‌కు చేరుకునేలా చేయడంలో కేఎల్ రాహుల్ విజయవంతం అయ్యాడు.

ఇకపోతే నిన్న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 14పరుగుల తేడాతో లక్నో ఓడిపోవడంతో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలన్న కేఎల్ రాహుల్ కల చెదిరింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 208పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో కేఎల్ రాహుల్ వీరోచితంగా పోరాడాడు. 58బంతుల్లో 79పరుగులతో దాదాపు లక్నో ఇన్నింగ్స్‌ను చివరి వరకు నడిపించాడు. 19వ ఓవర్లో హజిల్ వుడ్ బౌలింగ్లో రాహుల్ ఔటవ్వడంతో లక్నోకు ఓటమి తప్పలేదు. ఈ సీజన్లో కేఎల్ రాహుల్ అత్యధిక స్కోరు ముంబై ఇండియన్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో 60 బంతుల్లో 103పరుగులు.

ఇక ఎలిమినేటర్లో కేఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్ ద్వారా ఐపీఎల్ చరిత్రలో నాలుగు వేర్వేరు సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. 30 ఏళ్ల రాహుల్ 2021 సీజన్‌లో 13మ్యాచ్‌ల్లో 626 పరుగులు, 2020 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 670పరుగులు, 2018 సీజన్‌లో 659పరుగులు చేశాడు. అతను 2019 సీజన్‌లోనూ 593పరుగులు చేశాడు. మరో 7పరుగులు చేసి ఉంటే వరుసగా 5సీజన్లలో 600కు పరుగులు చేసిన ప్లేయర్ గానూ నిలిచేవాడు. ఇకపోతే 2020 సీజన్‌లో అతను ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు.

ఐపీఎల్లో అత్యంత స్థిరమైన బ్యాటర్ అని కేఎల్ రాహుల్ పేరు పడ్డాడు. ఈ టోర్నమెంట్‌లో ఇద్దరు ఐపీఎల్ దిగ్గజాలు క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ ఇప్పటికే మూడుసార్లు 600పరుగుల మార్క్‌ను అధిగమించారు. ఇప్పుడు కేఎల్ రాహుల్ నాలుగుసార్లు అధిగమించి నాలుగు సీజన్లలో 600పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ రేసులో రాజస్థాన్‌ ప్లేయర్ జోస్ బట్లర్ (718 పరుగులు) తర్వాత రెండో స్థానంలో కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు.

Story first published: Thursday, May 26, 2022, 17:12 [IST]
Other articles published on May 26, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+