Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Athiya Shetty- KL Rahul: కేఎల్ రాహుల్ కూతురి పేరు రివీల్.. అర్థమేంటో తెలుసా?

Athiya Shetty- KL Rahul: బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ దంపతులకు ఇటీవల కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ శుక్రవారం తన 33వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి దంపతులు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో తమ కూతురి పేరును రివీల్ చేశారు. ఆ చిన్నారికి "ఇవారా విపుల రాహుల్" అని పేరు పెట్టినట్లు పోస్ట్ లో కేఎల్ రాహుల్ తెలిపాడు. భార్య అతియా శెట్టి, కూతురు ఇవారాతో ఉన్న క్యూట్ ఫోటోను కేఎల్ రాహుల్ పోస్ట్ చేశాడు.

ఆ పేరుకు అర్థాన్ని కూడా ఈ జంట తెలిపింది. ఇవారా అంటే 'భగవంతుని గిఫ్ట్' అని.. అలాగే 'విపుల' కు అర్థం సంరక్షకుడు అని.. ఇక చివర ఉన్న రాహుల్ అంటే తన తండ్రి పేరు అని అతియా శెట్టి రాసుకొచ్చారు. ఈ మేరకు అతియా శెట్టి ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ షేర్ చేశారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్, అతియా దంపతులకు అభిమానులు మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.

KL Rahul-Athiya Shetty Reveal Baby Girl s Name Here s What Ivara Vipula Rahul Means

ఇదిలా ఉండగా.. కేఎల్ రాహుల్-అతియా శెట్టి దంపతులు మార్చి 24న తల్లిదండ్రులయ్యారు. కేఎల్ రాహుల్ సతీమణి అతియా శెట్టి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. అతియా శెట్టికి కూతురు పుట్టడంతో తాతయ్య సునీల్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. మనవరాలు పుట్టిన తర్వాత తన జీవితం మారిపోయిందన్నారు. కేఎల్ రాహుల్, అతియా శెట్టిలు జనవరి 23, 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Story first published: Friday, April 18, 2025, 16:13 [IST]
Other articles published on Apr 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+