INDvsAUS : నెట్స్‌లో చెమటోడుస్తున్న విరాట్, కేఎల్.. ఇద్దరికీ మూడో టెస్టు చావో రేవో!

టెస్టు క్రికెట్‌లో ఫామ్ లేక తంటాలు పడుతున్న టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇండోర్ వేదికగా జరిగే మూడో టెస్టుకు ముందు వీళ్లిద్దరూ కఠోర సాధన చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుమారు ఏడాది కాలంగా విరాట్, రాహుల్ ఇద్దరూ టెస్టుల్లో అంతంతమాత్రంగానే రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వీళ్లకు చాలా కీలకంగా మారింది.

రాహుల్ అట్టర్‌ఫ్లాప్..
ఈ సిరీస్‌లో రాణిస్తేనే కోహ్లీ, కేఎల్ ఇద్దరికీ టెస్టుల్లో చోటు దక్కేలా ఉంది. ఇంత ముఖ్యమైన సిరీస్ తొలి రెండు మ్యాచుల్లో కేఎల్ రాహుల్ చాలా దారుణంగా ఆడాడు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన అతను.. ఆ తర్వాత కనీసం ఆ స్కోరు కూడా చెయ్యలేదు. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో అత్యంత ఘోరంగా విఫలమయ్యాడు. ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాదని, రాహుల్‌కు అవకాశాలు ఇస్తున్న తరుణంలో మూడో టెస్టు అతనికి చావో రేవోగా మారింది.

కోహ్లీ సెంచరీ కావాలి..
ఇక విరాట్ కోహ్లీ విషయానికొస్తే గత మూడేళ్లుగా ఫామ్‌లో లేని అతను.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మళ్లీ గాడిలో పడ్డాడు. టీ20, వన్డే ఫార్మాట్లలో సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. అయితే టెస్టుల్లో మాత్రం అతని ఆటతీరు మెరుగవలేదు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో విఫలమైన అతనికి కూడా ఆసీస్‌తో టెస్టు సిరీస్ కీలకంగా మారింది.
కానీ తొలి టెస్టులో కోహ్లీ కూడా ఫెయిలయ్యాడు. అయితే ఢిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో కొంత పట్టుదల ప్రదర్శించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 44, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే కోహ్లీ నుంచి అభిమానులు ఈ 20, 30 పరుగులు ఆశించడం లేదు. భారీ స్కోర్లు కోరుకుంటున్నారు.
మూడో టెస్టు కీలకం..
కోహ్లీకి ఇండోర్ బాగా అచ్చొచ్చిన మైదానం. ఇక్కడ అంతకుముందు అతను డబుల్ సెంచరీ చేసి ఉన్నాడు. దీంతో మూడో టెస్టులో అయినా అతను అదరగొడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక కేఎల్ రాహుల్‌కు మూడో టెస్టులో అసలు చోటిస్తారా? అనేది అనుమానంగా మారింది. కానీ ద్రావిడ్, రోహిత్ ఇద్దరూ కూడా రాహుల్‌కు మద్దతుగా నిలవడంతో అతను ఈ మ్యాచ్ ఆడేలాగే ఉన్నాడు. కానీ మూడో టెస్టులో కూడా రాహుల్ విఫలమైతే మాత్రం మళ్లీ టీమిండియాలో చోటు దక్కడం చాలా కష్టంగా కనబడుతోంది. అందుకే వీళ్లిద్దరూ నెట్స్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications