బర్త్ డే రోజు అతియా శెట్టితో కేఎల్ రాహుల్.. ప్రేమాయణం నిజమేనా?!!

ముంబై: టీమిండియా క్రికెటర్లు, హీరోయిన్లతో డేటింగ్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. పేర్లు చెప్పుకుంటూ పొతే.. ఈ జాబితా చాలా పెద్దిగానే ఉంది. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పెళ్లితో ఒక్కటయ్యారు. ఇదే బాటలో మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ వెళ్తున్నాడా అంటే అభిమానులు అవుననే సమాధానం చెపుతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో రాహుల్ డేటింగ్ చేయడమే ఇందుకు కారణం.

అతియా ప్రేమలో రాహుల్
కేఎల్ రాహుల్, అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డిన్నర్ డేట్, పబ్, పార్టీలు అంటూ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరిగుతున్నారు. రాహుల్-అతియాల పద్దతి చూస్తే వీళ్ళ మధ్య ప్రేమ వ్యవహారం మరింత ముదిరిందని తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ ఇద్దరు పరిచయం అయ్యారు. అప్పటి నుండి వార్తల్లో నిలుస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

హాపీ బర్త్ డే అతియా
ఈ నెల 5న అతియా శెట్టి బర్త్ డే. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా కేఎల్ రాహుల్ ఓ పోస్ట్ చేశాడు. ఇందులో 'హాపీ బర్త్ డే' అని పేర్కొంటూ.. కోతి ఎమోజీని జత చేశాడు. దీనిపై స్పందించిన అతియా.. 'లవ్' గుర్తు ఎమోజీలను పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలోని పోటోలను బట్టి చూస్తే.. రాహుల్-అతియాలు కేఫ్ వెళ్లి సరదా సమయం గడిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. వీరి ప్రేమాయణం మరింత ముదిరిందని పోటోలు చెపుతున్నాయి.

పెళ్లి వరకు వెళుతుందా
హీరోయిన్లతో రాహుల్ డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఆకాంక్ష రంజన్‌తో రాహుల్ ప్రేమలో ఉన్నాడంటూ పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అతియా శెట్టి ప్రేమాయణం అయినా.. పెళ్లి వరకు వెళుతుందో లేదో చూడాలి.

పేలవ ఫామ్
పేలవ ఫామ్ కారణంగా ఇప్పటికే రాహుల్ భారత టెస్ట్ జట్టులో చోటు కోల్పోయాడు. రాహుల్ స్థానంలో ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న రోహిత్ శర్మ అదరగొట్టాడు. మరోవైపు మయాంక్ అగర్వాల్ కూడా డబుల్ సెంచరీ చేయడంతో ఇప్పట్లో రాహుల్‌కు అవకాశం రావడం కష్టమే. ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో కూడా రాహుల్ పరిస్థితి అంత బాగాలేదు. బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో విఫలమయ్యాడు. దీంతో అతని స్థానంలో యువ ఆటగాడు సంజు శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications