రాహుల్‌కు చోటు: కోపంగా గంభీర్ ఫ్యాన్స్, ట్విట్టర్‌లో ఫైట్
విశాఖపట్నం: టీమిండియా టెస్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండో టెస్టు కోసం భారత జట్టులోకి చేరాడు. గాయం కారణంగా ఆటకు దూరమైన రాహుల్ పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నాడని, అతనిని రెండో టెస్టుకు ఎంపిక చేసిన జట్టులోకి తీసుకుంటున్నామని బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే ఒక ప్రకటనలో తెలిపాడు.
తొడ కండరాల గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌కు రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రాహుల్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీలో కర్నాటక తరఫున ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 85 బంతుల్లో 76 పరగులు చేశాడు.
ఇక మంగళవారం రెండో ఇన్నింగ్స్‌లో 132 బంతుల్లో సెంచరీ (106 పరుగులు) సాధించి ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ను కూడా నిరూపించుకున్నాడు. దీంతో సెలక్టర్లను దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్‌తో వైజాగ్‌లో గురువారం మొదలయ్యే రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని జట్టు ప్రకటించింది.

గాయం తర్వాత జట్టులోకి రావాలంటే దేశవాళీ మ్యాచ్‌లో ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలన్న టీమిండియా చీఫ్ కోచ్ కుంబ్లే షరతు మేరకు రంజీ మ్యాచ్‌ను కేఎల్ రాహుల్ బాగానే ఉపయోగించుకున్నాడు. ఇక నవంబర్ 17 నుంచి విశాఖపట్నంలో జరగనున్న రెండో టెస్టులో గంభీర్ స్థానంలో మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
కేఎల్ రాహుల్‌ని టెస్టు జట్టులోకి తీసుకోవడంపై ట్విట్టర్ స్పందన:
హార్షా భోగ్లే
ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండో టెస్టు కోసం భారత జట్టులోకి తిరిగి తీసుకోవడంపై ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హార్షా భోగ్లే పైవిధంగా స్పందించారు.
అజమ్ మీమమ్
ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండో టెస్టు కోసం భారత జట్టులోకి తిరిగి తీసుకోవడంపై అజమ్ మీమమ్ పైవిధంగా స్పందించారు.
ఆరుష్
ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండో టెస్టు కోసం భారత జట్టులోకి తిరిగి తీసుకోవడంపై నెటిజన్లు ఎంతో సంతోషంగా ఉన్నారు.
అభిషేక్
తొలి టెస్టులో ఓపెనర్ గంభీర్ విఫలం కావడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గంభీర్ పని అయినట్టే
ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండో టెస్టు కోసం భారత జట్టులోకి తిరిగి తీసుకోవడంపై గంభీర్ అభిమానులు కోపంగా ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications