
నరైన్ డకౌట్:
హైదరాబాద్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు ఆరంభంలో షాక్ తగిలింది. వరుస ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సునీల్ నరైన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నితీష్ రాణా.. ఖలీల్ అహ్మద్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాది 14 రన్స్ రాబట్టాడు. టీ నటరాజన్ వేసిన ఐదో ఓవర్లో రాణా (26) కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఇక స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ వేసిన ఏడో ఓవర్ రెండో బంతికే కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఎల్బీడబ్లూగా వెనుదిరిగాడు. దేంతో మ్యాచ్ ఒక్కసారిగా సన్‌రైజర్స్ మలుపు తిరిగింది.

గిల్ హాఫ్ సెంచరీ:
సాధించాల్సిన రన్‌రేట్ తక్కువగా ఉండటంతో క్రీజులో ఉన్న శుభ్‌మన్ గిల్, మోర్గాన్ స్ట్రైక్‌రొటేట్ చేశారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే గిల్ హాఫ్ సెంచరీ బాదాడు. లక్ష్యం తక్కువగా ఉండడంతో మోర్గాన్ కూడా నెమ్మదిగా ఆడాడు. అయితే చివర్లో నటరాజన్ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన మోర్గాన్ లాంఛనం పూర్తి చేశాడు. దీంతో మరో రెండు ఓవర్లు మిగిలుండగానే కోల్‌కతా విజయం సాధించింది. వీరిద్దరూ 92 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

వార్నర్ రిటర్న్ క్యాచ్:
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో సన్‌రైజర్స్ ఏ దశలోనూ భారీ స్కోర్ సాధించేలా కనిపించలేదు. 24 పరుగుల వద్దే పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (5) బౌల్డవ్వగా.. తర్వాత 59 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ (36; 30 బంతుల్లో 2x4, 1x6) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ధాటిగా ఆడే క్రమంలో 10వ ఓవర్ తొలి బంతికే బౌలర్ వరున్ చక్రవర్తికి రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు.

పాండే అర్ధ శతకం:
ఆపై మనీష్ పాండే (51; 38 బంతుల్లో 3x4, 2x6), వృద్ధిమాన్ సాహా (30; 31 బంతుల్లో 1x4, 1x6) వికెట్ కాపాడుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. చివర్లో మనీష్ అర్ధ శతకం సాధించాక.. రసెల్ బౌలింగ్‌లో అనూహ్య రీతిలో ఔటయ్యాడు. ఇక మహ్మద్ నబి (11; 8 బంతుల్లో 2x4) రెండు బౌండరీలు బాదడంతో స్కోర్ 142 పరుగులకు చేరింది. కోల్‌కతా జట్టులో కమిన్స్, రసెల్, వరున్ తలో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications












