Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKRvsPBKS : మా టీంలో ఉన్న లోపం అదొక్కటే.. అందుకే ఓడాం: శిఖర్ ధవన్

పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసులో చాలా కీలకమైన మ్యాచ్‌లో చివరి వరవకు పోరాడినా చివరకు ఓడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈడెన్ గార్డెన్స్‌లో ఈ సీజన్‌లో ఛేజింగ్ టీమ్స్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచాయి. ఈ క్రమంలోనే పంజాబ్ సారధి శిఖర్ ధవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అయితే భారీ స్కోర్లు నమోదవ్వాల్సిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ (12), భానుక రాజపక్స (0) ఘోరంగా విఫలమయ్యారు. అయితే మిగతా బ్యాటర్లతో కలిసి కెప్టెన్ శిఖర్ ధవన్ (57) చివరి వరకుపోరాడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

KKRvsPBKS

ఈ టార్గెట్‌ను ఛేదించడంలో కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. రహ్మనుల్లా గుర్బాజ్ (15) విఫలమయ్యాడు. అయితే జేసన్ రాయ్ (38)తో జతకలిసిన నితీష్ రాణా (51) చక్కగా ఆడాడు. ఆ తర్వాత ఆండ్రీ రస్సెల్ (43), రింకూ సింగ్ (21 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్సులు ఆడారు. దీంతో కేకేఆర్ చివరి బంతికి నెగ్గింది. ఇలా ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఓడిపోవడంపై పంజాబ్ సారధి శిఖర్ ధవన్ స్పందించాడు.

'ఇక్కడ బ్యాటింగ్ చాలా కష్టంగా ఉంది. కాబట్టి మంచి టార్గెట్ సెట్ చేశామనే అనుకున్నా. వాళ్లు చాలా బాగా ఆడారు. చివరి ఓవర్లో అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి మ్యాచ్‌ షాక్ నుంచి తేరుకున్న అతను సూపర్‌గా ఆడాడు. ఆ క్రెడిట్ అతనికి కచ్చితంగా ఇవ్వాలి. అతను ఈ మ్యాచ్‌ను చివరి బంతి వరకు తీసుకెళ్లిన తీరు అద్భుతం' అని మెచ్చుకున్నాడు.

అదే సమయంలో బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడం గురించి కూడా గబ్బర్ మాట్లాడాడు. 'మా దగ్గర సరైన ఆఫ్‌స్పిన్నర్ లేడని నా అభిప్రాయం. ఎడం చేతి వాటం బ్యాటర్లు ఆడేటప్పుడు ఒక ఎండ్‌లో మాకు లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. మరో ఎండ్‌లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. కానీ సరైన ఆఫ్‌స్పిన్నర్ లేడు. అందుకే మా బౌలింగ్ యూనిట్ ఎక్కువగా రన్స్ ఇచ్చేస్తుందని నా అభిప్రాయం. ఈ పిచ్‌పై టర్న్ కూడా బాగుంది. అయినా ఆఫ్‌స్పిన్నర్ లేకపోవడం మా టీంను దెబ్బతీసిందని అనుకుంటున్నా' అని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, May 9, 2023, 7:46 [IST]
Other articles published on May 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+