Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKRvsPBKS : ప్లేఆఫ్స్ రేసులో కీలక మ్యాచ్.. టాప్-4లోకి పంజాబ్ దూసుకొస్తుందా?

ఐపీఎల్‌లో మరో రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేయడానికి కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకు వేసినట్లే. అదే కనుక పంజాబ్ గెలిస్తే.. ఏకంగా టాప్-4లోకి దూసుకొచ్చేస్తుంది. మరి ఇంత కీలకమైన మ్యాచ్‌లో పంజాబ్ గెలిచే ఛాన్స్ ఉందా?

పంజాబ్ జట్టు తన చివరి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పటి వరకు ఈ టీం ఆడిన 10 మ్యాచుల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉందీ జట్టు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుతుంది. ఈ క్రమంలో ఎలాగైనా గెలవాలని పంజాబ్ పట్టుదలగా ఉంది.

IPL Match can Punjab defeat Kolkata

అదే సమయంలో చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై నెగ్గిన కోల్‌కతా కూడా ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేయాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. అలాగే ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ కూడా చాలా కీలకం కానుంది. ఇక్కడ ఈ సీజన్‌లో జరిగిన నాలుగు మ్యాచుల్లో మూడింట మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది.

కాబట్టి ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ మరో ఆలోచన లేకుండా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికితోడు ఇది పూర్తి బ్యాటింగ్ పిచ్. ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్లు మూడుసార్లు 200 పైగా పరుగులు చేశాయి. ఈ సీజన్‌లో ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 211 కావడం గమనార్హం.

కాబట్టి మొదట బ్యాటింగ్ చేసిన కెప్టెన్ భారీ స్కోరు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. అయితే కేకేఆర్ ఎక్కువగా తమ స్పిన్ బౌలింగ్‌పై ఆధార పడుతోంది. ఆ జట్టులో రింకూ సింగ్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. నితీష్ రాణా, వెంకటేశ్ అయ్యర్ తదితరులు అడపా దడపా ఆడుతున్నారు.

చివరి మ్యాచ్‌లో కేకేఆర్ స్టార్ ఆండ్రీ రస్సెల్ కొంత ఫామ్ అందుకోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అలాగే వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ఫామ్‌లో ఉండటం కూడా కేకేఆర్‌కు ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే పంజాబ్ బ్యాటింగ్‌లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే చివరి మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ కూడా ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. ఇది పంజాబ్‌కు గ్యారంటీగా పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు.

కానీ పంజాబ్ బౌలింగ్‌లో ఎక్కువగా అర్షదీప్ సింగ్ మీదనే ఆధార పడుతోంది. రాహుల్ చాహర్ ఇప్పటి వరకూ పెద్దగా ఆకట్టుకోలేదు. శామ్ కర్రాన్ కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఇలాంటి సమయంలో కేకేఆర్‌ను సొంత మైదానంలో ఓడించడం కష్టమే. అయితే టాస్ గెలిచిన జట్టే ఈ మ్యాచ్‌లో గెలుస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి టాస్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

Story first published: Monday, May 8, 2023, 11:55 [IST]
Other articles published on May 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+