లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడిన కేకేఆర్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో రింకూ సింగ్ (63 నాటౌట్) హీరోయిక్ ఇన్నింగ్స్ వృధా అయింది. ఈ థ్రిల్లింగ్ విక్టరీతో లక్నో వరుసగా రెండోసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన లక్నో ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆరంభం నుంచే తమ స్పిన్ బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లను కేకేఆర్ కట్టడి చేసింది. ఫామ్‌లో ఉన్న మార్కస్ స్టొయినిస్ (0) డకౌట్ కూడా చేసింది. అయితే చివర్లో నికోలస్ పూరన్ అద్భుతంగా ఆడాడు. కేవలం 30 బంతుల్లోనే 58 పరుగులతో అలరించాడు. కుర్ర బ్యాటర్ ఆయుష్ బదోనీతో (25)తో కలిసి 74 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

దీంతో లక్నో జట్టు 176 పరుగుల టఫ్ టార్గెట్ సెట్ చేసింది. లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు మంచి ఆరంభమే లభించింది. జేసన్ రాయ్ (46) మరోసాకి ఆకట్టుకున్నాడు. అయితే మిగతా బ్యాటర్లు అనుకున్న స్థాయిలో రాణించలేదు. లక్నో స్పిన్నర్ల ధాటికి ఒకరొకరుగా అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇలాంటి సమయంలో రింకూ సింగ్ క్రీజులోకి వచ్చాడు.
ఆరంభంలో తన ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభించిన అతను.. క్రీజులో కుదురుకున్న తర్వాత భారీ షాట్లతో అలరించాడు. కానీ చివరి రెండు బంతుల్లో కేకేఆర్ విజయానికి 12 పరుగులు అవసరమవగా.. కేవలం 10 రన్స్ మాత్రమే చేయగలిగాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ ఓటమిపాలైంది. ఈ థ్రిల్లింగ్ విక్టరీపై లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా స్పందించాడు.
'గెలిచింనదుకు చాలా శాటిస్‌ఫ్యాక్షన్‌గా ఉంది. మేం ఏ స్థాయిలోనూ మ్యాచ్‌ను వదల్లేదు. చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ కుర్రాళ్లు అదరగొట్టారు. ఒక దశలో వాళ్లు 61/1తో ఉన్నారు. ఈ స్థాయిలో ఒక 2-3 టైట్ ఓవర్స్ పడితే మళ్లీ మేం పోటీలోకి వస్తామని నాకు తెలుసు. దానికితోడు స్పిన్నర్లకు పిచ్‌పై మంచి గ్రిప్ కూడా దొరికింది' అని చెప్పుకొచ్చాడు.
'ఈ ఏడాది రింకూ చాలా స్పెషల్‌గా ఆడాడు. అతను క్రీజులో ఉంటే ఆ మ్యాచ్‌ను ఈజీగా తీసుకోలేని పరిస్థితి కల్పించాడు. ఈ రోజు కూడా అదే చేశాడు. డెత్ ఓవర్లలో మా ప్లాన్స్ పక్కాగా అమలు చేయడం ఆ ఒత్తిడిలో చాలా కష్టం. అందుకే ప్రతి బంతి ముందూ బౌలర్లతో మాట్లాడుతూ వచ్చా. ప్లాన్ ప్రకారమే బౌలింగ్ చేయాలని చెప్పా. అయినా సరే బ్యాటర్ మంచి షాట్లు ఆడితే ఏం చేయలేమని స్పష్టంగా చెప్పేశా' అని కృనాల్ తెలిపాడు.
ఇక చివరి 20వ ఓవర్‌ను అనుభవం లేని యష్ ఠాకూర్ చేత వేయించడం ఏంటని కృనాల్ ప్రశ్నించగా.. 'అతని చేత బౌలింగ్ చేయించాలని నాకు అనిపించింది. నా గట్ ఫీలింగ్‌ను నమ్మా. చివరి మ్యాచ్‌లో పిచ్ నుంచి కొంత రివర్స్ స్వింగ్ లభించింది. అందుకే అప్పుడు మొహ్‌సిన్ ఖాన్‌కు బంతి ఇచ్చా. ఈరోజు పిచ్ కొంత స్లోగా ఉంది. దానికితోడు రెండు మూడు మంచి ఓవర్లు వేయడంతో ఠాకూర్ మంచి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు' అని చెప్పుకొచ్చాడు.