Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKRvsLSG : గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం.. విజయంతో లీగ్‌ను లక్నో ముగిస్తుందా?

ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం కావాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రెడీ అవుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను లక్నో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే లక్నో ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం అవుతుంది. అదే సమయంలో ఓడితే మాత్రం మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

కోల్‌కతాలో రెండు, మూడు రోజులుగా భారీగా వర్షం పడుతోంది. ఈ క్రమంలో మ్యాచ్ జరిగే శనివారం కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వర్షం పడి మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. అప్పుడు లక్నో పాయింట్ల సంఖ్య 16కు చేరుతుంది. ఆర్సీబీ, ముంబై రెండు జట్లు తమ చివరి మ్యాచులో గెలిస్తే ఈ టీమ్స్ పాయింట్లు కూడా 16 అవుతాయి.

KKRvsLSG Today IPL Match can LSG defeat KKR to fly off to Play offs

అయితే నెట్ రన్ రేట్ విషయంలో లక్నో ఈ రెండు జట్ల కన్నా ముందు వరుసలో ఉంది. కాబట్టి ఏదో అద్భుతం జరిగితే తప్ప కేకేఆర్‌తో మ్యాచ్ రద్దయినా కూడా లక్నో ప్లేఆఫ్స్ చేరుతుంది. గెలిస్తే ఇక ఢోకా ఉండదు. ఈ సీజన్‌లో లక్నోకు కొన్ని కీలకమైన ఎదురు దెబ్బలు తగిలాయి. కేఎల్ రాహుల్, స్టార్ పేసర్ మార్క్ వుడ్ టీంను లీగ్ మధ్యలో వదిలేయాల్సి వచ్చింది.

అయితే చివరగా ఆడిన మ్యాచుల్లో అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన లక్నో థ్రిల్లింగ్ విక్టరీలు సాధించి ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. ఇప్పుడు కేకేఆర్‌పై గెలిచిన ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకోవాలని అనుకుంటోంది. ఈడెన్ గార్డెన్స్‌లో స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఈ విషయంలో కేకేఆర్ కొంత మెరుగ్గా కనిపిస్తోంది.

కేకేఆర్‌లో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సునీల్ నరైన్ కూడా ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఇక యువ బౌలర్ సూయశ్ శర్మ కూడా సత్తా చాటుతున్నాడు. అదే సమయంలో లక్నో యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయి తన సత్తా ఏమాత్రం తగ్గలేదని ముంబైతో మ్యాచులో నిరూపించాడు. అలాగే లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా కూడా బంతితో రాణించగల సమర్ధుడే.

అవసరం అయితే కృష్ణప్ప గౌతమ్, అమిత్ మిశ్రా రూపంలో మరో స్పిన్నర్‌ను కూడా ఆడించే అవకాశం లక్నోకు ఉంది. ఈ మ్యాచ్‌లో లక్నోనే ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే తమ చివరి మ్యాచ్‌లో ఫ్యాన్స్‌కు జోష్ ఇవ్వాలని కేకేఆర్ కూడా పట్టుదలగా కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం ఆటాళ్ల ఫామ్‌ను పరిశీలిస్తే.. గెలిచే అవకాశాలు మాత్రం లక్నోకే ఒకింత ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Story first published: Saturday, May 20, 2023, 13:15 [IST]
Other articles published on May 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+