Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: సూర్య‌ నో చెప్పలేని బంపరాఫర్..ముంబైను వదిలి పాత గూటికి!

మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుండటంతో ఫ్రాంచైజీలు తమ వ్యూహాలకు మరింత పదునుపెట్టాయి. మెగా ఆక్షన్ రూల్స్‌పై ఓ అంచనాకు రావడంతో తమ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రధాన కోచ్‌, సహాయక సిబ్బందిపై ఫోకస్ పెట్టిన ఫ్రాంచైజీలు.. ఇక జట్టు నిర్మాణంపై దృష్టిసారించాయి. ఈ క్రమంలో కొన్ని ఫ్రాంచైజీలు ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయ్యాయి.

టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తుందని సమాచారం. సూర్యను తిరిగి తమ గూటికి సొంతం చేసుకోవడానికి భారీ ఆఫర్ ప్రకటించిందని తెలుస్తోంది. కెప్టెన్సీతో పాటు కళ్లు చెదిరే మొత్తాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

KKR s Massive Offer Likely to Lure Suryakumar Yadav Away from Mumbai Indians

సూర్య ఐపీఎల్ ప్రయాణం ముంబై ఇండియన్స్‌తోనే మొదలైంది. 2011లో ముంబై‌తో కాంట్రాక్ట్ పొందాడు. 2013 వరకు ఆ ఫ్రాంచైజీతో కొనసాగాడు. ఆ తర్వాత కేకేఆర్ గూటికి చేరాడు. అక్కడ కీలక ఇన్నింగ్స్‌‌లు ఆడాడు. అంతేగాక 2014 సీజన్‌లో కోల్‌కతా విజేత‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత తిరిగి ముంబైకి చేరుకున్న సూర్య 2018లో స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. ఆ సీజన్‌లో 512 పరుగులతో సంచలన ప్రదర్శన చేశాడు. క్రమంగా ముంబై జట్టులో కీలక ప్లేయర్‌గా నిలిచాడు.

కానీ ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ కోసం కొట్లాటలు జరుగుతుండటం ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కెప్టెన్సీ రేసులో రోహిత్ శర్మ తిరిగి రావడం, అంతేగాక హార్దిక్‌, బుమ్రాలలో ఒకరికి అవకాశం లభిస్తుందని ప్రచారం సాగుతుండటంతో సూర్య కూడా ఫ్రాంచైజీ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి ఉన్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యకు కేకేఆర్ కెప్టెన్సీ ఆఫర్ అందిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుత భారత టీ20 జట్టు పగ్గాలు నిర్వహించే సూర్య తమ కెప్టెన్ కొనసాగితే మంచి ఫలితాలు వస్తాయని కేకేఆర్ భావిస్తోంది. కాగా, గత సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, August 26, 2024, 8:50 [IST]
Other articles published on Aug 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+