Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ కుర్రాళ్లు ఏంట్రా.. మరి ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు!- స్టార్క్

కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన క్వాలిఫయిర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో కేకేఆర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ తుది పోరుకు చేరడం కోల్‌కతాకు ఇది నాలుగోసారి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్ మిచెల్ స్టార్క్ (3/34) మూడు, వరుణ్ చక్రవర్తి (2/26) ధాటికి 19.3 ఓవర్లలో 159 పరుగులకు కుప్పకూలింది.

రాహుల్ త్రిపాఠి (55; 35 బంతుల్లో, 7x4, 1x6) టాప్ స్కోరర్.ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (32; 21 బంతుల్లో, 3x4, 1x6), ప్యాట్ కమిన్స్ (30; 24 బంతుల్లో, 2x4, 2x6), అబ్దుల్ సమద్ (16; 12 బంతుల్లో, 2x6) మినహా మిగిలనెవరూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. అనంతరం ఛేదనకు దిగిన కేకేఆర్ 13.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

KKR vs SRH Vaibhav Arora and Harshit Rana are Very Talented and Skillful- Mitchell Starc

శ్రేయస్ అయ్యర్ (58*; 24 బంతుల్లో, 5x4, 4x6), వెంకటేశ్ అయ్యర్ (51*; 28 బంతుల్లో, 5x4, 4x6) అజేయ అర్ధశతకాలు సాధించారు. కమిన్స్ (1/38), నటరాజన్ (1/22) చెరో వికెట్ సాధించారు. కాగా, విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. తొలి ఓవర్లో విధ్వంసక ఓపెనర్‌ హెడ్‌ను ఔట్‌ చేసిన స్టార్క్ అయిదో ఓవర్లో నితీష్‌ కుమార్‌ రెడ్డి, షాబాజ్ అహ్మద్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేసి సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

కాగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం స్టార్క్ మాట్లాడాడు. ''పవర్‌ప్లే చాలా ముఖ్యమని తెలుసు. ఇరు జట్లు పవర్‌ప్లేలో బ్యాటుతో ఆధిపత్యం చెలాయించే జట్లే. అందుకే ఆదిలోనే వికెట్లు తీసి, మిడిలార్డర్‌పై ఒత్తిడి తీసుకురావాలని భావించాం. ఈ సీజన్‌లో ట్రావిస్ హెడ్-అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. బంతిని స్వింగ్ చేస్తూ వాళ్లను కట్టడి చేయాలని ప్లాన్ చేశాం. స్టంప్స్‌కు గురిపెడుతూ హార్డ్ లెంగ్త్ బంతులు విసరాలని భావించాం''

''ట్రావిస్ హెడ్‌ను ఆదిలోనే పెవిలియన్‌కు చేర్చడం సంతోషంగా ఉంది. హెడ్ వికెట్ సాధించడంలో కాస్త అదృష్టం కూడా ఉంది. ఇక మా యువ బౌలర్లు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా ఎంతో టాలెంటెడ్ కుర్రాళ్లు. వాళ్లెంతో శ్రమించారు. వాళ్ల ప్రదర్శన చూడటం సంతోషంగా ఉంది. ఈ సీజన్‌లో హర్షిత్ గొప్పగా రాణిస్తున్నాడు. ఈ కుర్రాళ్లు ఐపీఎల్‌లోనే కాదు, భారత్ తరఫున ఎన్నో వికెట్లు సాధిస్తారు'' అని స్టార్క్ అన్నాడు.

Story first published: Wednesday, May 22, 2024, 7:55 [IST]
Other articles published on May 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+