
కేన్ విలియమ్సన్ ఏమన్నాడంటే..
''మేము మొదట బౌలింగ్ చేస్తాం. ఇది మంచి వికెట్ అయినప్పటికీ మంచు ప్రభావం ఉంటుంది. జట్టు రోజు రోజుకు మెరుగవుతుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ బలమైన టీం. గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ ఈ రోజు ఆడడం లేదు. అతని స్థానంలో సుచిత్‌కు అవకాశం లభించింది.'' అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు.

శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే..
''పిచ్‌పై చాలా పచ్చిక ఉంది. కానీ మొదట బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉంది. ఆరోన్ ఫించ్, అమన్ ఖాన్ ఈ మ్యాచ్ ద్వారా ఈ సీజన్‌లో అరంగేట్రం చేస్తున్నారు. షెల్డన్ జాక్సన్ కూడా ఉన్నాడు.'' అని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

తుది జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, అమన్ హకీమ్ ఖాన్, వరుణ్ చక్రవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఐడెన్ మాక్రమ్, శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్.

హెడ్ టూ హెడ్ రికార్డులు
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు 21 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించి సన్‌రైజర్స్‌పై కోల్‌కతా అధిపత్యం చెలాయించింది. కోల్‌కతా 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇరు జట్లు తలపడినప్పుడు ఓ మ్యాచ్‌ల్లో అత్యధికంగా సన్‌రైజర్స్ 209 పరుగులు చేయగా.. కోల్‌కతా 187 పరుగులు చేసింది. ఇక అత్యల్పంగా సన్‌రైజర్స్ 115 పరుగులు చేయగా.. కోల్‌కతా 101 పరుగులు చేసింది.


Click it and Unblock the Notifications












