
కోల్‌కతానైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియన్స్ ఓ రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 17 రన్స్ చేసిన విలియమ్సన్ ఈ క్రమంలో ఐపీఎల్‌లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2 వేల పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. విలియమ్సన్ కంటే ముందు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ కూడా సన్‌రైజర్స్ తరఫున ఐపీఎల్‌లో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్ 4014 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో శిఖర్ ధావన్ 2518 పరుగులతో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో 2009 పరుగులతో కేన్ విలియమ్సన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 16 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ 3 ఫోర్లతో 17 పరుగులు చేసి ఆండ్రూ రసెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 68 మ్యాచ్‌లాడిన విలియమ్సన్ 38 సగటుతో 2009 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. నితీష్ రానా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో రానా 54 పరుగులు చేశాడు. ఆండ్రూ రస్సెల్ 25 బంతుల్లోనే 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రస్సెల్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ 25 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఫించ్ 7, జాక్సన్ 7, వెంకటేష్ 6, అమాన్ ఖాన్ 5, కమిన్స్ 3 పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 3, ఉమ్రాన్ మాలిక్ 2, భువనేశ్వర్, జాన్సన్, సుచిత్ తలో వికెట్ తీశారు.