KKR vs SRH: నటరాజన్ సూపర్ బౌలింగ్ .. తొలి బంతికే వెంకటేష్ క్లీన్ బౌల్డ్.. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు

కోల్‌కతానైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ టి. నటరాజన్ చెలరేగాడు. మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే వికెట్ తీశాడు. నటరాజన్ దెబ్బకు కేకేఆర్ ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్లో మరో వికెట్ కూడా తీశాడు. దీంతో సునీల్ నరైన్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ కల్పించి కోల్‌కతానైట్‌రైడర్స్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. అలాగే పవర్‌ప్లేలోనే కోల్‌కతానైట్‌రైడర్స్ 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
తొలి బంతికే నట్టూ వికెట్
మ్యాచ్‌లో ఐదో ఓవర్‌ను బౌలింగ్ చేసిన నటరాజన్ తొలి బంతికే కోల్‌కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అద్భుత బౌలింగ్‌తో నటరాజన్ వేసిన బంతి ఏకంగా మిడిల్‌స్టంప్‌కు తగిలింది. దీంతో 13 బంతులు ఎదుర్కొన్న వెంకటేష్ అయ్యర్ 6 పరుగులే చేసి నిరాశగా ఫెమిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన తొలి బంతికే సిక్సు కొట్టాడు. కానీ ఆ తర్వాతి బంతికి నటరాజన్ మళ్లీ తన ప్రతాపం చూపెట్టాడు. అద్భుతంగా పుల్‌టాస్ బాల్ వేశాడు. ఆ బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సునీల్ నరైన్ ఫీల్డర్ శశాంక్ సింగ్‌కు దొరికిపోయాడు. దీంతో వేసిన తొలి ఓవర్లోనే నటరాజన్ రెండు వికెట్లు సాధించాడు. అటు కోల్‌కతా నైట్‌రైడర్స్ 31 పరుగులకు 3 టాప్ వికెట్లు కోల్పోయింది. అంటే పవర్‌ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

జేన్సన్‌కు తొలి వికెట్
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మార్కో జాన్సెన్ తొలి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ ఆరోన్ ఫించ్‌ను 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఫెమిలియన్ పంపాడు. జాన్సెన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ నికోలస్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి ఫించ్ ఔటయ్యాడు.

తుది జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, అమన్ హకీమ్ ఖాన్, వరుణ్ చక్రవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఐడెన్ మాక్రమ్, శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్.

హెడ్ టూ హెడ్ రికార్డులు
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు 21 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించి సన్‌రైజర్స్‌పై కోల్‌కతా అధిపత్యం చెలాయించింది. కోల్‌కతా 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇరు జట్లు తలపడినప్పుడు ఓ మ్యాచ్‌ల్లో అత్యధికంగా సన్‌రైజర్స్ 209 పరుగులు చేయగా.. కోల్‌కతా 187 పరుగులు చేసింది. ఇక అత్యల్పంగా సన్‌రైజర్స్ 115 పరుగులు చేయగా.. కోల్‌కతా 101 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications